Health Care Tips: డైట్‌లో ఈ 5 పదార్ధాలుంటే కొలెస్ట్రాల్ దూరం, రక్త నాళికల శుద్ధి
తృణధాన్యాలు
శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గించేందుకు తృణ ధాన్యాలు అద్భుతంగా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇందులో లిక్విఫైడ్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి కొలెస్ట్రాల్‌ను శరీరం నుంచి బయటకు తొలగించేస్తుంది.
సోయా బీన్స్
సోయా బీన్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో ప్రోటీన్లు పెద్దమొత్తంలో ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దాంతో శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గించేందుకు అద్భుతంగా దోహదపడుతుంది.
గ్రీన్ వెజిటబుల్స్
అధిక కొలెస్ట్రాల్ సమస్య నిర్మూలించేందుకు కూరగాయలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఇందులో ఉండే వివిధ పోషకాలు శరీరంలో పేరుకుపోయే కొలెస్ట్రాల్ నిర్మూలనలో ఉపయోగపడతాయి.
వెల్లుల్లి
వెల్లుల్లి ప్రతి ఇంట్లో సులభంగా లభించే పదార్ధం. రుచి కోసం , వంటల్లో తాలింపు కోసం వెల్లుల్లి వినియోగిస్తుంటారు. కానీ వెల్లుల్లి ఆయుర్వేదపరంగా అద్భుతమైన ఔషధం. కొలెస్ట్రాల్ తగ్గించేందుకు వెల్లుల్లి చాలా బాగా ఉపయోగపడుతుంది.
డ్రై ఫూట్స్
వాల్‌నట్స్, జీడిపప్పు, పిస్తా, బందంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఉండే విటమిన్లు గుండెను ఆరోగ్యంగా ఉంచడంతో దోహదపడతాయి. చెడు కొలెస్ట్రాల్‌ను పూర్తిగా తగ్గిస్తాయి.