Health benefits of Amla: ఒక్క ఉసిరిలో ఇన్ని ఆరోగ్య ప్రయోజనలా ?
శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది ( Immunity booster )
శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి విటమిన్ సి ఎంతో సహాయపడుతోంది. ముఖ్యంగా శీతాకాలంలో వచ్చే ఇన్ ఫెక్షన్స్ కి చెక్ పెట్టడానికి ఉసిరి ఎంతో సహాయపడుతుంది.
శీతాకాలంలో అధికం అయ్యే కీళ్ళ నొప్పులను నివారించవచ్చు ( Best solution for joint pains )
ఉసిరిలో కీళ్ళ నొప్పులను తగ్గించే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఉసిరి తీసుకోవడం వల్ల శీతాకాలంలో అధికం అయ్యే కీళ్ళ నొప్పులను అదిగమించవచ్చు.
చుండ్రు, జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు మెరిసేలా చేస్తుంది ( Best solution for hair loss, dandruff issues )
ఉసిరి.. చుండ్రు, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. అలాగే చిన్న వయస్సులో జుట్టు తెల్లబడడం, నెరవడం వంటి సమస్యలను తగ్గిస్తుంది. జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తుంది. ఉసిరి షాంపూ, కండీషనర్, హెయిర్ ఆయిల్ వాడడం వల్ల బలమైన, మెరిసే జుట్టు మీ సొంతం అవుతుంది.
కంటి చూపుని మెరుగుపరుస్తుంది ( Amla improves Eyesight )
ఉసిరిలోని కెరోటిన్ కంటి చూపుని మెరుగుపరుస్తుంది. కళ్ళపై ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. కంట్లోంచి నీరు కారే సమస్యను నివారించే గుణాలు ఉసిరి సొంతం
మలబద్ధకాన్ని నివారిస్తుంది ( Best solution for constipation problem )
ఉసిరి నాచురల్‌గా దొరికే ఆల్కలీన్. ఇందులో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల జీర్ణవ్యవస్థను క్లియర్ చేయడానికి, బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. అంతే కాకుండా మలబద్దకాన్ని నివారించడంలో సహాయపడుతుంది.
విటమిన్ సి రక్త నాళాలను బలంగా చేస్తుంది ( Oxidative stress )
ఉసిరిలోని విటమిన్ సి రక్త నాళాలను బలంగా చేస్తుంది. అలాగే డిటాక్సిఫికేషన్‌కి సహాయపడుతుంది. ఉసిరిలోని యాంటీఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.