Mushroom Health Benefits: పుట్టగొడుగులు తింటే పుట్టేడు లాభాలు..ఎలాంటి రోగమైనా పరార్ అవ్వాల్సిందే..!!
మెదడు ఆరోగ్యానికి: పుట్టగొడుగులు రుచికరమైన, పోషకమైన శిలీంద్రాలు. వీటిని శాఖాహారులు ఇష్టంగా తింటుంటారు. నిత్యం ఆహారంలో పుట్టగొడుగులు చేర్చుకుంటే మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
పోషకాలు: పుట్టగొడుగుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు, డైటరీ ఫైబర్, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని మీ ఆహారంలో చేర్చుకుంటే ఈ పోషకాలన్నీ అందుతాయి.
జ్నాపకశక్తి: కొత్త అధ్యయనం ప్రకారం బలహీనమైన జ్నాపకశక్తి, భాష సమస్యలు, అభిజ్నా బలహీనత వంటి సమస్యలను తగ్గించడంలో ఎంతగానో సహాయం చేస్తాయి.
గట్ ఆరోగ్యానికి : పుట్టగొడుగులు గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ప్రేగులలో మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తుంది. ఈ బ్యాక్టీరియా నరాల మధ్య సందేశాలను ప్రసారం చేసే న్యూరోట్రాన్స్మిటర్ల ఉత్పత్తికి సహాయపడతాయి.
అల్జీమర్స్ వ్యాధి: లయన్స్ మేన్ మష్రూమ్..ఒక రకమైన పుట్టుగొడుగు. ఇది నరాల కణజాలాల ఉత్పత్తిని రక్షించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అల్జీమర్స్ వ్యాధి, మొద్దుబారిన మెదడు, వయస్సు సంబంధిత మానసిక రుగ్మతల నుంచి కాపాడుతుంది.
క్యాన్సర్: మష్రూమ్స్ లో ఉండే లినోలిక్ యాసిడ్ యాంటీ కార్సినోజెనిక్ కాంపౌండ్ గా పనిచేయడంతోపాటు శరీరంలో అధిక ఈస్ట్రోజెన్ స్థాయిలు కలిగి ఉండే హానికరమైన ప్రభావాలను తొలగించేస్తుంది. రొమ్ము క్యాన్సర్ నుంచి రక్షిస్తుంది.
అందం: పుట్టగొడుగులు బ్యూటీ ప్రొడక్టులలోకూడా ఉపయోగిస్తుంటారు. వీటిని మన డైట్లో చేర్చుకుంటే చర్మం ముడతలు తగ్గి, కణాలను పునరుజ్జీవింప చేయడంలోనూ సహాయపడుతుంది.