Twins Born: అరటి పండు తింటే కవలలు పుడతారా? ఇందులో వాస్తవమెంత?

Thu, 05 Dec 2024-8:49 am,

కవలల జననం: కవల పిల్లలు పుట్టడం చాలా అరుదు. పుట్టిన కవలలు ఒకేలా కనిపిస్తే.. మరికొందరు భిన్నంగా కనిపిస్తారు.

సాధారణ ప్రక్రియ: సాధారణంగా ఒక స్త్రీ ఒక బిడ్డకు జన్మనిస్తుంది. అతి కొద్ది సందర్భాల్లో మాత్రమే ఇద్దరు (కవలలు) లేదా అంతకంటే ఎక్కువ పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంది.

ఫలదీకరణం: ఆడవారు ఋతుస్రావం తర్వాత 10 నుంచి 18 రోజుల తర్వాత గుడ్డు ఉత్పత్తి చేస్తారు. దానిని అండం అంటారు. ఈ సమయంలో ఒక స్త్రీ, పురుషుడు శారీరక కలయిన ఏర్పడినప్పుడు పురుషుడి స్పెర్మ్‌లోని శుక్రకణం గుడ్డులోకి ప్రవేశిస్తుంది. ఈ ప్రక్రియను ఫలదీకరణం అంటారు. అంటే స్త్రీ గర్భవతి అవుతుంది. 280 రోజుల తర్వాత స్త్రీ ఒక బిడ్డకు జన్మనిస్తుంది. ఇది సాధారణ ప్రక్రియ.

ఒకేలా: కొన్నిసార్లు ఫలదీకరణ ప్రక్రియ తర్వాత గుడ్డు రెండు భాగాలుగా విడిపోతుంది. ఈ పరిస్థితిలో రెండు వేర్వేరు పిల్లలు గర్భంలో అభివృద్ధి చెందుతాయి. అప్పుడు ఇద్దరు పిల్లలు పుడతారు. ఈ విధంగా జన్మించిన పిల్లలను కవలలుగా పిలుస్తారు. ఒకే ఆకారం, రంగు, పరిమాణం కలిగి ఉంటారు. లింగం కూడా ఒకటే ఉంటుంది. పుడితే ఆడపిల్లలు లేదా ఇద్దరూ అబ్బాయిలు పుడతారు. ఒకే గుడ్డు నుంచి పుట్టడమే ఇందుకు కారణం.  

భిన్నంగా: పురుషుడి వీర్యం నుంచి రెండు స్పెర్మ్ స్త్రీ విడిగా ఉన్న గుడ్లలోకి ప్రవేశిస్తుంది. దీని వల్ల కడుపులోనే ఇద్దరు పిల్లల ఎదుగుదల ఏర్పడుతుంది. తర్వాత ఇద్దరు పిల్లలు పుడతారు. ఇలా పుట్టిన కవల పిల్లలు భిన్నంగా ఉంటారు. ఈ ఇద్దరు పిల్లల లింగం ఒకేలా ఉండవచ్చు లేదంటే భిన్నంగా ఉండవచ్చు.

30 ఏళ్ల తర్వాత: ఆలస్యంగా గర్భధారణ పొందితే కవలలు పుడతారని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. మహిళలు 30 ఏళ్ల తర్వాత పిల్లలను కలిగి ఉండాలని కోరుకుంటే వారికి కవలలు పుట్టే అవకాశం ఉంది. ఇది వంశపారంపర్యంగా కూడా రావచ్చు.

అరటిపండు వాస్తవం: కవల అరటిపండు తింటే కవల పిల్లలు జన్మిస్తారనే నమ్మకం ప్రచారంలో ఉంది. అయితే అరటిపండ్లు తినడానికి కవలలు పుట్టడానికి ఎలాంటి సంబంధం లేదని వైద్య శాస్త్రం చెబుతోంది. ఇది కేవలం పుకారు.. మూఢనమ్మకం అంటూ వైద్యులు కొట్టిపారేస్తున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link