Radish Side Effects: ముల్లంగి ఈ ఐదు రకాల వ్యక్తులు పొరపాటున కూడా తినకూడదు
పాలిచ్చే తల్లులు
పాలిచ్చే తల్లులు కూడా ముల్లంగి తినకూడదు. ఇందులో ఉండే కొన్ని పోషకాలు పాలలో చేరి శిశువుకు హాని కల్గించవచ్చు.
గర్బిణీ మహిళలు
గర్భిణీ మహిళలకు ముల్లంగి తినడం ఆరోగ్యరీత్యా మంచిది కాదు. అందుకే వైద్యులు గర్భిణీ స్త్రీలకు డైట్‌లో ముల్లంగి ఉండకూడదంటారు.
పిత్తాశయంలో రాళ్లు
చాలామందికి పిత్తాశయంలో రాళ్లు ఉంటాయి. ఈ పరిస్థితుల్లో ముల్లంగి అస్సలు తినకూడదు. ముల్లంగిలో పిత్తాశయం ఉత్పత్తిని పెంచే గుణాలుంటాయి. దాంతో రాళ్ల సమస్య పెరిగిపోతుంది.
హైపోగ్లైసీమియా
హైపోగ్లైసీమియా అంటే లో బ్లడ్ షుగర్ సమస్య ఉన్నప్పుడు కూడా ముల్లంగి తినకూడదు. ముల్లంగిలో ఇన్సులిన్ పెంచే గుణాలుంటాయి. దీనివల్ల బ్లడ్ షుగర్ స్థాయి తగ్గిపోతుంది.
లో బీపీ సమస్య
చాలామందికి లో బీపీ సమస్య ఉంటుంది. ఈ సమస్యతో బాధపడేవాళ్లు ముల్లంగి తినకూడదు. ముల్లంగి తినడం వల్ల శరీరంలో నీరు బయటకు పోయి లో బీపీ సమస్య పెరిగిపోతుంది.