Best Morning Habits: రోజూ ఉదయం వేళ ఈ 5 అలవాట్లు పాటిస్తే..రోజంతా ఎలా ఉంటుందో తెలుసా
హెల్తీ బ్రేక్‌ఫాస్ట్
రోజూ ఉదయం తీసుకునే అల్పాహారం హెల్తీగా ఉండాలి. దీనివల్ల రోజంతా శరీరానికి కావల్సిన ఎనర్జీ లభిస్తుంది. ఇందులో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్ జోడించాలి. బ్రేక్‌ఫాస్ట్‌లో పప్పులు, ఓట్స్, గుడ్లు, పాలు, పండ్లు, కూరలు వంటివి ఉంటే మంచిది.
వెలుతురులో ఉండటం
ప్రకృతి అందించే వెలుతురును ఉదయం వేళ ఆస్వాదించడం వల్ల ప్రాకృతిక గతి తప్పకుండా ఉంటుంది. రోజూ ఉదయం వేళ కాస్సేపు బయట వాకింగ్ లేదా జాగింగ్ ద్వారా బయటగడిపితే చాలా మంచిది.
వ్యాయామం
ఉదయం వేళ వ్యాయామం చేయడం వల్ల శరీరానికి ఎనర్జీ లభిస్తుంది. అలసట దూరమౌతుంది. అంతేకాకుండా మూడ్ కూడా మెరుగుపడుతుంది. ప్రతిరోజూ ఉదయం కాస్సేపు స్ట్రెచింగ్ చేసినా సరిపోతుంది. తేలికపాటి వ్యాయామం లేదా జాగింగ్, వాకింగ్, సైక్లింగ్ కూడా మంచి అలవాట్లు.
ఉదయం గోరువెచ్చని నీళ్లు తాగడం
మనిషి శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేట్‌గా ఉంచాలి. దీనివల్ల అలసట దూరమై శరీరానికి శక్తి లభిస్తుంది. రోజుకు కనీసం 8 గ్లాసుల నీళ్లు తప్పకుండా తాగాలి. ఉదయం లేచిన వెంటనే ఒక గ్లాసు గోరువెచ్చని నీల్లు తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.
ఉదయాన్నే లేవడం
ఉదయం త్వరగా లేవడం రోజువారీ దినచర్యలో మంచి అలవాటు కాగలదు. దీనివల్ల శరీరానికి విశ్రాంతి చేకూర్చేందుకు , రిఫ్రెష్ చేసేందుకు సమయం లభిస్తుంది. ఉదయాన్నే లేవడం వల్ల రోజంతా ప్లానింగ్ సక్రమంగా ఉంటుంది.