Black Sesame Benefits: డైట్‌లో ఈ సీడ్స్ ఉంటే హార్డ్ ఎటాక్, మలబద్ధకం వంటి సమస్యలన్నీ దూరం
హెల్తీ స్కిన్
నల్ల నువ్వుల్లో ఉండే వివిధ రకాల పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్ల వల్ల రక్తం శుభ్రమౌతుంది. రక్తం శుభ్రం కావడం వల్ల చర్మానికి నిగారింపు వస్తుంది.
ఎముకలకు బలం
నల్ల నువ్వుల్లో ఉండే కాల్షియం వల్ల ఎముకలు బలంగా మారతాయి. ఎముకలకు సంబంధించి లేదా కీళ్ల నొప్పులు బాధిస్తుంటే నల్లనువ్వలు క్రమం తప్పకుండా తీసుకంటే మంచి ఫలితాలు చూడవచ్చు.
హెల్తీ లివర్
నల్ల నువ్వుల్లో ఉండే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్ల వల్ల శరీరంలోని వ్యర్ధ మలినాలు బయటకు తొలగిపోతాయి. ముఖ్యంగా లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. శరీరం అంతర్గతంగా శుభ్రమౌతుంది.
జీర్ణక్రియ
నల్ల నువ్వుల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందుకే క్రమం తప్పకుండా తీసుకుంటే కడుపు సంబంధిత సమస్యలైన మలబద్ధకం, అజీర్తి వంటివి దూరమౌతాయి. మలబద్ధకం సమస్యకు ఇది రామబాణం రాంటిది.
హెల్తీ హార్ట్
నల్ల నువ్వుల్లో పోలీ అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్, యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఫలితంగా చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. గుండె వ్యాధుల ముప్పు కూడా తగ్గుతుంది. గుండెను ఆరోగ్యంగా, పటిష్టంగా ఉంచేందుకు నల్ల నువ్వులు అత్యంత లాభదాయకం.