Kalonji Health Benefits: కలోంజీ విత్తనాలతో ఇలా చేస్తే మరణం తప్ప అన్ని సమస్యలు దూరం
బరువు తగ్గేందుకు
స్థూలకాయం సమస్యను పోగొట్టేందుకు కలోంజీ అద్భుతంగా ఉపయోగపడుతుంది. అయితే రోజూ క్రమం తప్పకుండా పరగడుపున గోరు వెచ్చని నీళ్లలో కలోంజీ ఆయిల్ కలుపుకుని తాగాలి. ఇలా చేస్తే అధిక బరువు తగ్గించుకోవచ్చు.
చర్మ సంరక్షణ
చర్మ సంబంధిత సమస్యలు దూరం చేసేందుకు కలోంజీ విత్తనాలు లేదా కలోంజీ ఆయిల్ అద్బుతంగా ఉపయోగపడుతుంది. కలోంజీ ఆయిల్‌ను నిమ్మరసంతో కలిపి చర్మానికి రాయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది.
గుండె ఆరోగ్యానికి
శరీరంలో కీలకమైన, అతి ముఖ్యమైన భాగం గుండె. గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు కలోంజీ అద్బుతంగా ఉపయోగపడుతుంది. కలోంజీ ఆయిల్‌ను వేడి నీళ్లు లేదా టీలో కలుపుకుని తాగాలి.
ఆరోగ్యం కోసం
పికిల్స్, మటర్, పూరీల్లో కలోంజీ కలిపి వండుతారు. కొన్ని రకాల కూరగాయల్లో కూడా కలుపుతారు. ఇందులో చాలా పోషకాలున్నాయి. కాల్షియం, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, జింక్ వంటి మూలకాలు చాలా ఉన్నాయి. శరీరానికి ప్రయోజనకరం...
జలుబు నుంచి రక్షణ
సీజన్ మారగానే జలుబు, జ్వరం వంటి సమస్యలు వెంటాడుతుంటాయి. అయితే కలోంజీని వేడి చేసి ఆ వాసన చూస్తూ ఉంటే జలుబు నుంచి సులభంగా పరిష్కారం లభిస్తుంది.
డయాబెటిస్ నియంత్రణలో
డయాబెటిస్ వంటి ప్రమాదకరమైన వ్యాధిని నియంత్రించడంలో సైతం కలోంజీ ఆయిల్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. టీలో కలోంజీ ఆయిల్ మిక్స్ చేసి తాగడం వల్ల మంచి ఫలితాలుంటాయి.