Health Tips: ఈ పద్ధతులు పాటిస్తే ఆర్ధరైటిస్ సమస్యకు చిటికెలో పరిష్కారం
బరువు తగ్గడం
ఆర్ధరైటిస్ నొప్పుల్ని తగ్గించాలంటే శరీర బరువు తగ్గించాల్సి ఉంటుంది. అదనంగా ఉన్న బరువు కచ్చితంగా జాయింట్స్‌పై ప్రభావం చూపిస్తుంది. ఒత్తిడి కల్గిస్తుంది. దాంతో ప్రశాంతత ఉండదు. హెల్తీ ఫుడ్, తగిన వ్యాయామం వంటి పద్ధతుల ద్వారా బరువు తగ్గించుకోవచ్చు.
మెడిసిన్స్
వైద్యుడిని సంప్రదించి ఆర్ధరైటిస్‌కు తగిన మందులు తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఆర్ధరైటిస్ సమస్యకు ఇప్పుడు మందులు పూర్తిగా అందుబాటులో ఉన్నాయి.
వ్యాయామం
నిర్ణీత పద్దతిలో రోజూ తగిన రీతిలో వ్యాయామం చేయడం ద్వారా ఆర్ధరైటిస్ సమస్యకు చెక్ పెట్టవచ్చు. జాయింట్ పెయిన్స్ తగ్గించడమే కాకుండా కండరాలను పటిష్టం చేస్తుంది. ఆర్ధరైటిస్ సమస్య తగ్గుతుంది.
హాట్ అండ్ కోల్డ్ థెరపీ
హీటింగ్ ప్యాడ్ లేదా వేడి కాపరంతో మజిల్స్ రిలాక్స్ అవుతాయి. జాయింట్స్ పట్టేయడం తగ్గుతుంది. దీనికోసం కోల్డ్ ప్యాక్ ధెరపీ కూడా అద్భుతంగా పనిచేస్తుంది.
మానసిక శారీరక ప్రక్రియ
ధ్యానం లేదా యోగా, దీర్ఘంగా శ్వాస పీల్చి వదిలే ప్రక్రియ, మానసిక, శారీరక ప్రక్రియల ద్వారా ఆర్ధరైటిస్ నొప్పుల్ని తగ్గించుకోవచ్చు.