Home Remedies: చలికాలం సమస్యల్నించి దూరంగా ఉండాలంటే..ఈ ఐదు రకాల పదార్ధాలకు దూరం పాటించాల్సిందే
టీ, కాఫీలో ఉండే కెఫీన్ కారణంగా దగ్గు పెరుగుతుంది. గొంతు ఎండిపోతుంటుంది. దగ్గు ఉన్నప్పుడు టీ, కాఫీలు తాగకూడదు.
బియ్యం స్వభావం చలవ చేసేదిగా ఉంటుంది. చలికాలంలో అన్నం తినడం తగ్గించాలి. అన్నం తినడం వల్ల కఫం సమస్య పెరిగిపోతుంది. జలుబు, దగ్గు వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి.
ఫ్రైడ్ పదార్ధాలకు దూరంగా ఉండాలి. లేకపోతే దగ్గు, జలుబు సమస్య పెరుగుతుంది. ప్రోసెస్డ్ పదార్ధాలు ఇమ్యూనిటీని తగ్గిస్తాయి. వ్యాధుల్ని పెంచుతాయి.
డైరీ ఉత్పత్తులు తినడం వల్ల జలుబు, దగ్గు సమస్యలు పెరుగుతాయి. పాలతో తయారయ్యే వస్తువులతో కఫం పెరుగుతుంది. జలుబు, దగ్గు ఉంటే నెయ్యి, పెరుగు వంటి పదార్ధాలకు దూరంగా ఉండాలి.
కోల్డ్ పదార్ధాలు
చలికాలంలో కోల్డ్ పదార్ధాలు తినకూడదు. ముఖ్యంగా ఫ్రిజ్లో ఉంచిన పదార్ధాలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. కొన్ని వస్తువుల స్వభావం చలవ చేస్తుంది. దోసకాయ, టొమాట వంటి పదార్ధాలు ఫ్రిజ్లో ఉంచి తినకూడదు. ఐస్క్రీమ్స్కు పూర్తిగా దూరంగా ఉండాలి.