Unhealthy Gut Signs: మీ కడుపులో పురుగులున్నాయా లేవా, ఈ లక్షణాలతో తెలిసిపోతుంది
కడుపు ఉబ్బరం
చాలారోజులుగా కడుపు ఉబ్బరంగా ఉంటే తేలిగ్గా తీసుకోవద్దు. తక్షణం పరీక్ష చేయించుకోవాలి. కడుపులో అంటే ప్రేవుల్లో పరుగులున్నాయో లేదే తెలుసుకుని మందులు తీసుకోవడం మంచిది.
కడుపులో నొప్పి
మలద్వారం ద్వారా గ్యాస్ విడుదలైనప్పుడు అక్కడ విపరీతమైన నొప్పి ఉంటుంది. కడుపులో లేదా ప్రేవుల్లో పురుగులు ఉంటే ఈ సమస్య ఉత్పన్నమౌతుంది.
గ్యాస్ ఎక్కువగా ఉండటం
కడుపులో అజీర్తి కారణంగా గ్యాస్ పరిమితి దాటి విడుదలవుతుంటే ప్రేవుల్లో ఏదో సమస్య ఉన్నట్టు అర్ధం చేసుకోవచ్చు. ప్రేవుల్లో బ్యాక్టీరియా ఉంటేనే ఇలా జరుగుతుంది. ఇదొక ప్రమాదకర స్థితి. తక్షణం వైద్యుడిని సంప్రదించాలి.
మలబద్ధకం
ప్రేవుల్లో ఏ విధమైన సమస్య తలెత్తినా మలబద్ధకం, డయేరియా వంటి సమస్యలు రావచ్చు. అనారోగ్యకరమైన లేదా నిల్వ ఆహారం తింటే ఇలా జరుగుతుంది. అందుకే తీసుకునే ఆహారం హెల్తీగా ఉండాలి.
యాసిడ్ రిఫ్లక్స్
చాలాసార్లు భోజనం చేసిన గంట తరువాత కూడా గొంతులో యాసిడ్ ఉన్నట్టు మండుతుంటుంది. ఎందుకంటే తినే ఆహారం జీర్ణమయ్యేందుకు కడుపులో విడుదలయ్యే గ్యాస్..గొంతు వరకూ వచ్చేస్తుంటుంది. ప్రేవుల్లో పురుగులకు ఇది సంకేతం కావచ్చు.