Fruits for Skin: డైట్‌లో ఈ పండ్లు చేరిస్తే..శిల్పాశెట్టిలా నిత్య యౌవనం మీ సొంతం
స్ట్రాబెర్రీ
స్ట్రాబెర్రీ తినడం వల్ల చర్మానికి చాలా ఉపయోగం. ఇందులో యాంటీ ఏజీయింగ్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. చర్మంపై ముడతల్ని దూరం చేస్తాయి. స్ట్రాబెర్రీలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల చర్మ సమస్యలు దూరమౌతాయి.
బొప్పాయి
బొప్పాయి చర్మం కోసం చాలా ప్రయోజనకరం. వివిధ రకాల ఉత్పత్తుల్లో కూడా ఉపయోగిస్తారు. బొప్పాయి తినడం వల్ల బాడీ డీటాక్స్ అవుతుంటుంది. చర్మంలో ముడతలు, పింపుల్స్ వంటి సమస్యలు పోతాయి.
ఆరెంజ్
ఆరెంజ్‌లో ఉండే పోషక గుణాలు చర్మానికి చాలా లాభం చేకూరుస్తాయి. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలున్నాయి. యాంటీ ఏజీయింగ్ పని చేస్తాయి. చర్మాన్ని సంరక్షించి..యౌవనంగా ఉంచుతాయి.
నేరేడు
నేరేడులో ఉండే పోషక గుణాలు చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి. నేరేడులో విటమిన్ సి, విటమిన్ ఇ, పొటాషియం వంటి పోషకాలు చాలా ఉంటాయి. ఈ న్యూట్రియంట్లు చర్మ సమస్యల్ని దూరం చేస్తాయి.
యాపిల్
యాపిల్ చర్మాన్ని టైట్‌గా, గ్లోయింగ్‌గా ఉంచుతుంది. ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్ సి ట్యానింగ్, సన్‌బర్న్ సమస్యల్ని పోగొడుతుంది.