Hemoglobin: మీ బాడీలో రక్తం హిమోగ్లోబిన్ కొరత ఉందా..అయితే ఈ 5 సూపర్ ఫుడ్స్ తీసుకోవల్సిందే
తృణధాన్యాలు ఆరోగ్యానికి ఎప్పుడూ మంచివే. ఇందులో ఉండే విటమిన్లు, మినరల్స్ ఆరోగ్యానికి ప్రయోజనకరం. ముఖ్యంగా హిమోగ్లోబిన్ శాతం పెంచేందుకు డైట్‌లో తృణధాన్యాలు తప్పకుండా చేర్చాలి.
గ్రీనీ వెజిటెబుల్స్ శరీరానికి చాలా ప్రయోజనకరం. పాలకూర, బ్రోకలీ, మెంతులు వంటి కూరగాయల్ని డైట్‌లో చేర్చుకుంటే..హిమోగ్లోబిన్ శాతం వేగంగా పెరుగుతుంది.
ఆనపకాయ విత్తనాలు ఆరోగ్యానికి చాలా చాలా మంచివి. హిమోగ్లోబిన్ శాతం ఎప్పుడూ తక్కువగా ఉండేవారు ఆనపకాయ విత్తనాలతో మెరుగైన ఫలితాలుంటాయి. ఇందులో ఉండే పోషకాలు హిమోగ్లోబిన్ శాతం పెంచుతాయి.
డ్రైఫ్రూట్స్ శరీరం బరువు తగ్గించేందుకు దోహదపడతాయి. కిస్మిస్, బాదం వంటి డ్రైఫ్రూట్స్ డైట్‌లో తప్పకుండా చేర్చుకోవాలి.
బ్రౌన్ రైస్ ఒక ఆరోగ్యకరమైన సూపర్ ఫుడ్. ఇందులో ఐరన్ అధిక మోతాదులో ఉంటుంది. ఫలితంగా హిమోగ్లోబిన్ పెరుగుతుంది.