Fenugreek Seeds Side Effects: మెంతులతో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయా, జాగ్రత్త
జీర్ణక్రియ సమస్య
మెంతులు ఆరోగ్యానికి నిస్సందేహంగా మంచివే. కానీ మోతాదు మించి వాడకూడదు. శృతి మించి వాడితే చాలా రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా జీర్ణక్రియ సంబంధిత సమస్యలు ఎదురౌతాయి.
ముఖంపై స్వెల్లింగ్
మెంతులు అతిగా తీసుకోవడం వల్ల ముఖంపై స్వెల్లింగ్ సమస్య ఏర్పడుతుంది. ఎలర్జీ వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి.
తలనొప్పి
మెంతులు ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలు కలిగినవే. మెంతి నీళ్లు తాగడం వల్ల చాలా రకాల వ్యాధులు అరికట్టవచ్చు. కానీ ఎక్కువగా సేవించడం వల్ల వికారం, తలనొప్పి వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి.
గర్భిణీ మహిళలు
గర్భిణీ మహిళలు మెంతులు ఎక్కువగా తినకూడదు. ఇది కడుపులో బిడ్డ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. వైద్యుని సలహా మేరకే తీసుకోవడం మంచిది.
పొటాషియం లోపం
మెంతులు ఎక్కువగా తీసుకోవడం వల్ల పొటాషియం లెవెల్స్ తగ్గవచ్చు. అందుకే ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి. ఆరోగ్యానికి మంచిదనే ఉద్దేశ్యంతో అదే పనిగా తీసుకోకూడదు.