White Food Risk: ఈ 5 రకాల వైట్ ఫుడ్స్ దూరం పెట్టకపోతే డయాబెటిస్, స్థూలకాయం సమస్యలే
వైట్ రైస్
అన్నం లేకుండా భోజనం అసంపూర్తిగా ఉంటుంది. చాలామంది అన్నం ఇష్టంగా తింటుంటారు. ప్రోసెస్ చేసే క్రమంలో ఇందులో ఉండే పోషకాలు తొలగిపోతాయి. వైట్ రైస్ తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ముప్పు వెంటాడుతుంది.
వైట్ పొటాటో
బంగాళదుంప అంటే అందరికీ ఇష్టమే. స్థూలకాయం, డయాబెటిస్ సమస్యకు చెక్ పెట్టాలంటే బంగాళదుంప సాధ్యమైనంత తక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే బంగాళదుంపలో స్టార్చ్, కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. పొటాటోని డీప్ ఫ్రై లేదా వెన్న, క్రీమ్‌తో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి మరింత హానికరం. కేవలం డయాబెటిస్ సమస్యే కాకుండా..కేన్సర్ ముప్పు కూడా పెరుగుతుంది.
పంచదార
వైట్ ఫుడ్స్‌లో పంచదార మరింత ప్రమాదకరం. రిఫైండ్ షుగర్‌ను ఎంప్టీ కేలరీగా పిలుస్తారు. ప్రోసెస్డ్, రిఫైండ్ పంచదారలో ఆరోగ్యానికి మేలు చేకూర్చేవి ఉండవు. పంచదార నేరుగా రక్తంలో కలిసిపోతుంది.
ఉప్పు
ఉప్పు ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే ఉప్పు అధికంగా ఆరోగ్యానికి హానికారకం. శరీరంలో తగిన సోడియం, క్లోరైడ్ సమస్య ఉప్పు కారణంగా ఉంటుంది. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో నీటి పరిమాణంపై ప్రభావం పడుతుంది. దాంతో బ్లడ్ వెస్సెల్స్ దెబ్బతింటాయి. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. ఎముకలు బలహీనమౌతాయి. కడుపు సంబంధిత సమస్యలు ఉత్పన్నమౌతాయి.
మైదా
మైదాతో తయారయ్యే వైట్ బ్రెడ్, కేక్, బిస్కట్, పేస్ట్రీ వంటి పదార్ధాలు ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిస్తుంటాయి. గోధుమల్ని రిఫైండ్ చేసినప్పుడు ఫైబర్, మంచి కొలెస్ట్రాల్, మినరల్స్, ఫైటో న్యూట్రియంట్లు తొలగిపోతాయి. గర్భిణీలకు ఇన్సులిన్ రెసిస్టెన్స్, టైప్ 2 డయాబెటిస్ ముప్పుకు కారణమౌతుంది.