Anti Ageing Foods: డైట్‌లో ఈ 5 పదార్ధాలుంటే చాలు, అరవైలో కూడా నిత్య యౌవనం
డ్రై ఫ్రూట్స్
వాల్‌నట్స్, బాదం, చియా సీడ్స్, ఫ్లక్స్ సీడ్స్ వంటి వాటిలో విటమిన్ ఇ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ , ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు చర్మాన్ని హెల్తీగా ఉంచుతాయి.
చేపలు
సాల్మన్, ట్యూనా, మ్యాకరెల్ వంటి చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. దాంతోపాటు కీళ్ల నొప్పుల సమస్యను దూరం చేస్తుంది.
బెర్రీ ఫ్రూట్స్
స్ట్రా బెర్రీస్, బ్లూబెర్రీస్, రాస్ బెర్రీస్ వంటి పండ్లలో ఆంథోసైనిన్ అనే ప్రత్యేకమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇవి మెదడును ఉత్తేజితం చేస్తాయి. దాంతోపాటు స్వెల్లింగ్ సమస్యను తగ్గిస్తుంది.
టొమాటో
టొమాటోలో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు సూర్య కిరణాల ద్వారా జరిగే నష్టాన్ని నివారిస్తాయి. చర్మానికి కాంతిని అందిస్తాయి.
ఆకు కూరలు
పాలకూర, గానుగ, బ్రోకలీ వంటి ఆకు కూరల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. ఈ విటమిన్లు శరీరంలో ఫ్రీ రాడికల్స్ ఏర్పర్చే నష్టాన్ని నియంత్రిస్తాయి. ఇందులో ఉండే ఫైబర్ కారణంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. చర్మం యౌవనంగా కన్పిస్తుంది.