Food Habits: తిన్న వెంటనే ఈ 5 పనులకు దూరంగా ఉండకపోతే అనారోగ్యం తప్పదు
నీళ్లు
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచాలంటే నీళ్లు తప్పనిసరి. రోజంతా తగిన పరిమాణంలో నీళ్లు తప్పకుండా తీసుకోవాలి. అయితే తిన్న వెంటనే ఎక్కువ నీళ్లు తాగడం మాత్రం మంచిది కాదు.
టీ-కాఫీ
చాలామందికి భోజనం చేసిన తరువాత టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. అయితే ఈ అలవాటు ఏ మాత్రం మంచిది కాదు. బోజనం తరువాత టీ, కాఫీలు తాగితే అజీర్థి సమస్య తలెత్తవచ్చు. అయితే హెర్బల్ టీ తాగితే ఎలాంటి నష్టం ఉండదు.
స్వీట్స్
చాలామంది, ముఖ్యంగా మనదేశంలో భోజనం తరువాత స్వీట్స్ తినే అలవాటు ఉంటుంది. దీనివల్ల రక్తంలో చక్కెర శాతం పెరిగిపోతుంది. అందుకే భోజనం తరువాత ఎప్పుడూ స్వీట్స్ తినకూడదు. స్వీట్స్ స్థానంలో డార్క్ చాకొలేట్స్ ఫరవాలేదు.
నిద్ర
తిన్న వెంటనే సాధారణంగా చాలామందికి నిద్ర ముంచుకొస్తుంటుంది. కానీ ఇది ఏ మాత్రం మంచి అలవాటు కాదు. దీనివల్ల యాసిడ్ రిఫ్లెక్స్ సమస్య రావచ్చు. భోజనం చేసిన తరువాత కనీసం 2 గంటలు విరామం ఉండాల్సిందే.
పండ్లు
భోజనం చేసిన తరువాత వెంటనే పండ్ల జ్యూస్ తాగకూడదు. ఒకవేళ లంచ్ లేదా డిన్నర్ తరువాత ఫ్రూట్ జ్యూస్ తాగితే జీర్ణ సమస్య ఉత్పన్నం కావచ్చు.