Health Benifits Of Lemon: నిమ్మరసం తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
క్రమం తప్పకుండా నిమ్మరసం తాగడం, నిమ్మకాయ వంటలు తినే వారికి చర్మ సమస్యలు బారిన పడే అవకాశాలు చాలా తక్కువ. ఇది చర్మంపై పొక్కులు, మంట, దురద లాంటివి రాకుండా రక్షిస్తుంది.
ఊబకాయంతో బాధపడేవారికి పరిష్కారం చూపిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు రోజూ ఉదయం కాస్త నిమ్మరసం తాగడం వల్ల కొన్ని రోజుల్లోనే ఫలితం కనిపిస్తుంది.
బీపీని నియంత్రిస్తుంది. నిమ్మకాయలో పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. ఇది Blood Pressure (బీపీ) సమస్యకు చెక్ పెడుతుంది.
వెంట్రుకలకు ప్రయోజనకారి. నిమ్మకాయ రసం తలకు పట్టించి కొన్ని నిమిషాలపాటు మర్దనా చేసి తల స్నానం చేస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది. వెంట్రుకలకు మంచి పోషణ లభిస్తుంది.
Also Read : How to loss weight: అధిక బరువు తగ్గాలంటే రాత్రి పడుకునే ముందు ఈ డ్రింక్స్ తాగండి
నిమ్మకాయలో అధికంగా లభించే విటమిన్-సి (Vitamin C) వేడిని దూరం చేస్తుంది. నిమ్మరసంలో ఉండే ఖనిజ లవణాలు శరీరానికి సత్తువ అందిస్తాయి. Also Read : Health Benefits Of Bitter Gourd: ఈ ప్రయోజనాలు తెలిస్తే కాకరకాయ కచ్చితంగా తింటారు