Heavy Rains Alert: ఉత్తరాది భారీ వర్షాలకు ఇళ్లు, మార్కెట్లు, వంతెనలు అన్నీ ధ్వంసం
మండి జిల్లాలో ఒక్కసారిగా విరుచుకుపడిన వరద ధాటికి తునాగ్ ప్రాంతంలోని ప్రధాన మార్కెట్ ఏ విధంగా నాశనమైందో మరో వీడియోలో గమనించవచ్చు. కొండ ప్రాంతాల్నించి కొట్టుకువచ్చే వరదతో పాటు కలప కూడా కొట్టుకొస్తూ అడ్డొచ్చిన చిన్న చిన్న ఇళ్లను ధ్వంసం చేసుకుంటూ పోతున్న బీభత్స దృశ్యాలు
కులూ మనాలీ మార్గంలో రోడ్లపై కొండచరియలు, పెద్ద పెద్ద రాళ్లు విరిగిపడటంతో పరిస్థితి భయానకంగా మారింది. బియాస్ నది ఉధృతంగా ప్రవహిస్తూ లోతట్టు ప్రాంతాల్ని ముంచెత్తుతోంది.
ఢిల్లీలో అయితే గత 41 ఏళ్లలో లేనంత భారీ వర్షం నమోదైంది. భారీ వర్షాలు దేశ రాజధాని ఢిల్లీని ముంచెత్తుతున్నాయి. రెండ్రోజుల్నించి కురుస్తున్న భారీ వర్షాలతో నగరమంతా జలమయమైంది. ఎంపీల ఇళ్లు కూడా నీట మునిగాయంటే పరిస్థితి తీవ్రత అర్ధం చేసుకోవచ్చు.
వాగులు, వంకలు, నదీ నదాలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్ని ముంచెత్తుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని ఆట్ బంజర్‌ను కలిపే వంతెన వరద ధాటికి చూస్తూ చూస్తుండగానే కొట్టుకుపోయింది.
భారీ వర్షాలతో ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలమౌతున్నాయి. యాస్ నది ఉధృతంగా ప్రవహిస్తూ లోతట్టు ప్రాంతాల్ని ముంచెత్తుతోంది.