Height Growth Tips: మీ పిల్లలు ఎత్తు ఎదగడం లేదా, ఈ 5 ఆసనాలు వేస్తే చాలు
త్రికోణాసనం
నిటారుగా నిలుచుని కాళ్లను పూర్తిగా చాచాలి. ఇప్పుడు కుడి చేతివైపు 90 డిగ్రీలు పూర్తిగా వంచాలి. ఎడమ కాలిని 45 డిగ్రీలు వంచాలి. శ్వాస తీసుకోవడం వదలడం చేయాలి. తిరిగి ఎడమవైపు 90 డిగ్రీలు వంచి కుడి కాలిని 45 డిగ్రీల్లో ఉంచి శ్వాస తీసుకోవడం, వదలడం చేయాలి.
శీతాకోకచిలుక ఆసనం
భూమిపై కూర్చుని కాలి పాదాల అడుగుల్ని కలిపి రెండు చేతులతో పట్టుకోవాలి. కాస్సేపు అలానే ఉంచి శ్వాస తీసుకుని వదలడం చేయాలి.
భుజంగాసనం
కడుపు ఆదారంగా పడుకోవాలి. కాళ్లను కలిపి ఉంచాలి. తలను నేలకు ఆన్చాలి. చేతుల్ని భుజాలకు దిగువన ఉంచాలి. మోచేతుల్ని మడిచి నడుము వరకూ పైభాగాన్ని పైకి లేపాలి. మెడ వెనక్కి వంచకూడదు. ఇలా కాస్సేపు ఉండి శ్వాస తీసుకోవడం, వదలడం చేయాలి
శీర్షాసనం
దండాసనంలో కూర్చుని మీ తలను నేలకు ఆన్చాలి. చేతుల్ని మోచేతులతో మడిచి తలకు ఆసరా ఇవ్వాలి. కాళ్లను నెమ్మది నెమ్మదిగా పైకి లేపాలి. బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ కొన్ని సెకన్లపాటు ఉండాలి.
తాడాసనం
నిటారుగా నిలుచుని కాళ్లను మీ భుజాలంత వెడల్పులో చాచాలి. మీ రెండు చేతుల్ని జోడించి మీ ఛాతీ మీదుగా పైకి ఉంచాలి. దీర్ఘంగా శ్వాస తీసుకుని నెమ్మదిగా వదలాలి. ఇలా కాస్పేపు చేయాలి.