Samantha-Naga Chaitanya: ఆగస్ట్ 8తో సమంతకి ఉన్న రిలేషన్.. అందుకే ఆరోజే నిశ్చితార్థం చేసుకున్న చైతన్య..!

Fri, 09 Aug 2024-2:06 pm,

ఏం మాయ చేసావే సినిమాతో.. తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన.. హీరోయిన్ సమంత. మొదటి సినిమాతోనే అందరినీ ఆకట్టుకున్న ఈ హీరోయిన్.. ఆ తరువాత..తెలుగులో వరసగా అవకాశాలు తెచ్చుకునింది. కాగా తన మొదటి చిత్రం.. హీరో నాగచైతన్యతో ప్రేమలో కూడా పడింది.  

నాగచైతన్య, సమంత ఇద్దరూ కలిసి.. ఎన్నో సినిమాలలో కనిపించారు. అంతేకాదు వీరిద్దరూ తెలుగు ప్రేక్షకుల మదిలో.. బెస్ట్ కపుల్ గా కూడా పేరు తెచ్చుకున్నారు. దీంతో వీరిద్దరూ కొన్ని సంవత్సరాల క్రింద పెళ్లి చేసుకోగా..అప్పుడు నాగచైతన్య, సమంత అభిమానుల ఆనందానికి.. హవదులు లేకుండా పోయాయి 

అయితే ఈ ఆనందం అభిమానులకు.. ఎన్నో రోజులు మిగలలేదు .‌మూడు సంవత్సరాల తరువాత వీరిద్దరూ విడాకులు.. ప్రకటించి అందరిని షాక్ కి గురిచేశారు. దీనికి కారణం ఏమిటి అని.. అప్పుడు ఎంతోమంది తల పట్టుకున్నారు. అయితే కొంతమంది మాత్రం నాగచైతన్య.. శోభితతో ప్రేమలో ఉన్నాడని.. అందుకే సమంత వదిలేసింది అని చెప్పుకొచ్చారు.

ఇక అప్పుడు వారు చెప్పిందే.. ఇప్పుడు నిజమయింది.. సమంతా నాగచైతన్య విడిపోయి..దాదాపు మూడు సంవత్సరాలు కావస్తుండగా.. ఫైనల్ గా ఇప్పుడు నాగచైతన్య.. శోభితతో నిశ్చితార్థం జరుపుకున్నారు. ఈ నిశ్చితార్థం ఆగస్టు 8న.. నాగార్జున నివాసం నందు జరగా.. ఈ నిశ్చితార్థం డేట్ గురించి..ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది 

ఇంతకీ విషయం ఏమిటి అంటే.. ఆగస్టు 8న సమంత నాగచైతన్యకి ప్రపోజ్ చేసిందట. మళ్లీ అదే ఆగస్టు 8న నాగ చైతన్య, శోభితని నిశ్చితార్థం చేసుకున్నాడు. మొత్తానికి ఇలా ఆగస్టు 8వ.. తారీకు సమంతకి కూడా ముడి పడడం వల్ల..ఈ విషయాన్ని అభిమానులు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link