Fennel seeds: భోజనం తరువాత సొంపు తింటే ఏం జరుగుతుంది..?
భోజనం కింద వెంటనే ఎంతోమంది సొంపు తినడం మనం చూస్తూనే ఉంటాము..
అయితే ప్రస్తుతం సోంపు తినే వారు తక్కువైపోతున్నారు.
కానీ భోజనం అయిన వెంటనే ఒక స్పూన్ సొంపు తినడం ద్వారా.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
ప్రధానంగా వాత, పిత్త దోషాలు వల్ల కలిగే రోగాలు నయమవుతాయి.
మధుమేహం ఉన్నవారు భోజనం తర్వాత సొంపు తినడం వల్ల.. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
బీపీ, గుండె సమస్యలు కూడా రాకుండా ఇది కాపాడుతుంది.
జీర్ణాశయ సమస్య నుంచి కూడా మనం బయటపడవచ్చు.