Nagarjuna: కింగ్ నాగార్జునకు పాకిస్థాన్ నటుడి కూతురుకు ఉన్న ఈ రిలేషన్ తెలిస్తే.. మీరు షాక్ అవ్వడం పక్కా
హైదరాబాద్లో పుట్టి పెరిగిన టాబు బాలనాటిగా 1982లో తొలిసారిగా వెండితెరపై తళుక్కుమంది. 1991లో విక్టరీ వెంకటేశ్ సరసన తొలిసారిగా హీరోయిన్ గా కూలీ నెంబర్ వన్ సినిమాలో కనిపించింది. దర్శకేంద్రుడి యాంగిల్ లో అమ్మడి అందాలు చూసి కుర్ర కారు ఊగిపోయింది.
ఆ తర్వాత టాబు బాలీవుడ్లో తన సత్తా చాటింది. అజయ్ దేవగన్ సరసన విజయ్ పథ్ సినిమా ద్వారా టాబు ఫేమస్ అయిపోయింది. ఆ తర్వాత అడపాదడపా సినిమాలు చేస్తూ మళ్ళీ తెలుగులో కూడా కింగ్ నాగార్జున సరసన సిసింద్రీ సినిమాలో తొలిసారిగా ఐటమ్ భామగా కనిపించింది. ఆ తర్వాత నిన్నే పెళ్ళాడుతా సినిమాలో నాగార్జున సరసన హీరోయిన్ కనిపించి చక్కటి పర్ఫామెన్స్ అందించింది.
అంటే తమిళంలో ప్రేమదేశం సినిమా సూపర్ హిట్ అయింది. ఆ సినిమా ద్వారా కోలీవుడ్ లో కూడా తాగు సంచలనంగా మారింది. మలయాళం లో కాలాపాని సినిమా ద్వారా మోహన్ లాల్ సరసన కూడా నటించి మలయాళం లో కూడా తన సత్తా చాటింది.
టాబు బ్యాక్ గ్రౌండ్ ఏంటా అని ఆలోచిస్తే మాత్రం ఆసక్తికరమైన విషయాలు బయటపడతాయి. టాబు ఆమె సోదరి ఫరా కూడా బాలివుడ్ హీరోయిన్. టాబూ తల్లిదండ్రులు జమాల్ అలీ హష్మీ, రిజ్వానా. ఆమె హైదరాబాద్ కు చెందిన ఒక ముస్లిం కుటుంబంలో జన్మించింది.
ఆమె తండ్రి పాకిస్తాన్‌లో ఒక నటుడు. ఆయన తన అదృష్టాన్ని బాలివుడ్ లో పరీక్షించుకునేందుకు పాకిస్థాన్ నుంచి ఇండియాకు చేరుకొని టాబూ తల్లి రిజ్వానాను వివాహం చేసుకున్నారు. జమాల్ అలీ గరం హవా చిత్రంలో నటించారు. కానీ ఇక్కడ కూడా కెరీర్ అంతగా సాగలేదు దీంతో ఆయన రిజ్వానాకు డైవర్స్ ఇచ్చేసి మళ్లీ పాకిస్థాన్ వెళ్లిపోయాడు.
టాబు స్కూలింగ్ అంతా హైదరాబాదులోనే సాగింది. ఆ తర్వాత ఆమె ముంబై షిఫ్ట్ అయింది. అక్కడే కాలేజీలో చదువుతుండగానే బాలీవుడ్ లో అడుగు పెట్టింది. ప్రస్తుతం టాబు వయసు 50 సంవత్సరాలు దాటింది. అయినప్పటికీ అమ్మడు బాలీవుడ్ లో వరుస అవకాశాలను సంపాదించుకుంటుంది.