Hero Splendor 135Cc Price: 135 ÇC ఇంజన్‌తో కొత్త Hero Splendor బైక్ వచ్చేస్తోంది.. ఫీచర్స్ క్రేజీ ఉన్నాయ్.. ఇప్పుడే తెలుసుకోండి!
ఈ హీరో స్ప్లెండర్ (Hero Splendor) మోటర్ సైకిల్ స్టైలిష్ లుక్‌లో విడుదల కాబోతోంది. అంతేకాకుండా ఇది ప్రీమియం మైలేజీతో విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ బైక్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ వైరల్ అవుతున్నాయి.
హీరో స్ప్లెండర్ 135 CC బైక్ అనేక అధునాతన ఫీచర్లతో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే డిజిటల్ స్పీడోమీటర్‌తో పాటు ఓడోమీటర్ వంటి ఫీచర్లతో లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఇందులో ప్రత్యేకమైన LED హెడ్‌లైట్లు కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ మోటర్ సైకిల్ టైర్స్ కూడా ట్యూబ్‌లెస్ విభాగంలో రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ బైక్‌లో ప్రత్యేకమైన అల్లాయ్ వీల్స్‌తో పాటు ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ సెటప్‌ను కూడా అందిస్తోంది. అలాగే హీరో కంపెనీ మొబైల్ ఛార్జింగ్ కోసం USB ఛార్జింగ్ పోర్ట్‌ను కూడా అందిస్తోంది.
అలాగే హీరో స్ప్లెండర్ 135 CC మోటర్ సైకిల్ బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లలో విడుదల కానుంది. అలాగే ఈ మోటర్ సైకిల్ లీటర్‌కి దాదాపు 75 కీలో మీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది. అంతేకాకుండా సుదీర్ఘంగా పనిచేందుకు కూడా ఈ మోటర్ సైకిల్ చాలా బాగుంటుంది.
ఇక ఈ మోటర్ సైకిల్ ధర వివరాల్లోకి వెళితే.. దీని ధర రూ.79,800 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దీనిపై కంపెనీ ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందించే అవకాశాలు ఉన్నాయి. అయితే హీరో కంపెనీ ఈ మోటర్ సైకిల్‌కి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనుంది.