Sai Pallavi: నాగచైతన్య పెళ్లితో సాయిపల్లవి కూడా వివాహానికి సిద్ధం.. కాబోయే వరుడెవరో తెలుసా?
ప్రాధాన్యం ఉంటేనే: నటనకు ప్రాణమిచ్చే సాయి పల్లవి తనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలనే చేస్తూ సినీ పరిశ్రమలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఆమె కూడా: సినీ పరిశ్రమలోకి వచ్చి దాదాపు దశాబ్దం దాటింది. తన తోటి నటీనటులు కీర్తి సురేశ్, నాగచైతన్య కూడా పెళ్లి చేసుకోవడంతో ఇప్పుడు సాయి పల్లవి పెళ్లి గురించి చర్చ జరుగుతోంది.
చెల్లి పెళ్లి: ఇటీవల తన చెల్లి పెళ్లి చేసేయడంతో ఇప్పుడు సాయి పల్లవిపై ఒత్తిడి పెరుగుతోంది. ఎప్పుడు చేసుకుంటారనే సినీ పరిశ్రమతోపాటు ఇంట్లో కూడా అడుగుతున్నారని సమాచారం.
పెళ్లిపై ఆలోచన: విశ్వసనీయ సమాచారం ప్రకారం సాయి పల్లవి కూడా తన పెళ్లిపై ఆలోచిస్తున్నారని తెలుస్తోంది.
మనసుకి నచ్చినోడు: అందరితో స్నేహంగా మెలిగే సాయి పల్లవి ఎవరినీ ప్రేమించకపోవడం ఆశ్చర్యకరం. తన మనసుకు నచ్చినోడిని చేసుకోవడానికి సాయిపల్లవి చేసుకుంటారంట.
నాడు వాయిదా: కరోనా సమయంలోనే పెళ్లి ప్రతిపాదన రాగా 'నేను ఇంకా అనుకున్నది సాధించలేదు' అని చెప్పి సాయి పల్లవి వాయిదా వేసింది.
కొన్నాళ్లు విరామం: ఆ తర్వాత సినిమాల్లో బిజీ ఉండడం కారణంగా కొన్నాళ్లు పెళ్లి ప్రతిపాదన ఆగిపోయింది. ఇప్పుడు అందరి పెళ్లిళ్లు అయిపోతుండడంతో సాయిపల్లవిపై ఒత్తిడి పెరిగింది.
పుకార్లు: ఈ ఒత్తిడికి తలొగ్గి పెళ్లికి సాయిపల్లవి అంగీకరించినట్లు సమాచారం. ఈ వార్త సినీ పరిశ్రమలో చక్కర్లు కొడుతోంది.
పెద్దోళ్లకే బాధ్యత: అయితే పెళ్లికి అంగీకరించినా కూడా ఒక నిబంధన పెట్టినట్లు సమాచారం. 'తల్లిదండ్రులు చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను' అని సాయి పల్లవి చెప్పినట్లు తెలుస్తోంది.