CM Sukhu Samosa Missing: సీఎం సమోసా మిస్సింగ్.. సీఐడీ దర్యాప్తుకు ఆదేశించిన సర్కారు.. అసలు స్టోరీ ఏంటంటే..?
సాధారణంగా రాజకీయ నేతలు, ముఖ్య నాయకులు వచ్చినప్పుడు.. కొన్ని ప్రదేశాలలో మీటింగ్ లలో స్పెషల్ స్నాక్స్ లను ఏర్పాటు చేస్తుంటారు. స్థానికంగా ఉండే స్పెషల్ ఫుడ్ లను సైతం ఆర్డర్ పెడుతుంటారు. అయితే.. హిమచల్ ప్రదేశ్ లోని సీఎం సుఖ్విందర్ సింగ్ కు చేదుఅనుభవం ఎదురైంది.
హిమచల్ ప్రదేశ్ ఇటీవల సీఐడీ సైబర్ వింగ్ స్టేషన్ ను ప్రారంభిచడానికి వెళ్లారు. అక్కడ అధికారులు ఫైవ్ స్టార్ హోటల్ నుంచి ప్రత్యేకంగా సమోసాలు, స్నాక్స్ లను సీఎం సుఖ్విందర్ సింగ్ కోసం తెప్పించి, సీఎం కోసం ఏర్పాటు టెబుల్ మీద ఉంచారంట.
కానీ సీఎం అక్కడకు వెళ్లి కూర్చునే సరికి మాత్రం సమోసా, కేకులు స్నాక్స్ లు అక్కడలేదు. సీఎం సుఖు.. చాలాసేపు అక్కడ కూర్చుని చివరకు వెళ్లిపోయాంరంట. సీఎం కూడా కనీసం మర్యాదలు పాటించర అంటూ మండిపడ్డారంట.
అయితే.. సీఎం కోసం సమోసాలు కేకులు తెప్పించాలని ఓ ఐజీ ర్యాంక్ అధికారి ఎస్సైకి చెప్పారంట. ఆయన ఏఎస్సై, హెడ్‌కానిస్టేబుల్‌తో కలిసి షిమ్లాలోని లక్కర్ బజార్‌లో ఉన్న రాడిసన్ బ్లూ హోటల్‌కు వెళ్లారు. మూడు బాక్సుల్లో సమోసాలు, కేకులు తీసుకొచ్చారంట. మరీ అవి ఎక్కడకు వెళ్లాయని ట్విస్ట్ గా మారింది..
సీఎం నిర్వహించిన మీటింగ్.. లో సుఖ్విందర్ సింగ్ తో పాటు.. సీఐడీ అధికారులు కూడా ఆకలితోనే వెళ్లిపోయారంట. దీనిపైన పెద్ద వివాదమే చెలరేగిందంట. దీనిపై ప్రస్తుతం హిమచల్ ప్రదేశ్ సర్కారు సీఐడీ ఇన్వెస్టిగేషన్ కు ఆదేశించిందంట.
కొంత మంది భద్రత సిబ్బంది సమోసాలు, స్నాక్స్ లు తినేశారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం దీనిపైన విచారణ కొనసాగుతుంది. ఈ ఘటన మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దేశంలో మరే సంఘటన దొరకలేదా.. సీఐడీ దర్యాప్తుకు అని నెటిజన్లు సెటైర్ లు వేస్తున్నారు.