Glacier Melting: దేశంలో వేగంగా కరుగుతున్న గ్లేసియర్లు, పెరుగుతున్న ముప్పు
ఖాట్మండూలోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెన్ డెవలప్‌మెంట్ నివేదిక ఆందోళన కల్గిస్తోంది. రానున్న కాలంలో ఆకశ్మిక వరదలు, వర్షాల ముప్పు పొంచి ఉందని తెలుస్తోంది. ఈ గ్లేసియర్ల నుంచే గంగా, యమునా, అలకానంద, పిండారీ ఇతర నదులు ప్రవహిస్తున్నాయి.
గ్లేసియర్లు కరగడం చాలా ప్రమాదకర పరిస్థితి. గ్లేసియర్లు కరగడం వల్ల జీవనదులు భవిష్యత్తులో ఇంకిపోతాయి. ఫలితంగా నీటి కొరత, ధాన్యం కొరత అన్నీ వెంటాడుతాయి. గ్లేసియర్లు వేగంగా కరగడం వల్లనే వరదలు కూడా సంభవిస్తున్నాయి.
ఈ గ్లేసియర్లపై నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ దృష్టి సారించింది. గ్లేసియర్లు కరగడంపై ఇస్రో పరిశీలిస్తోంది.
ఉత్తరాఖండ్‌లోని ఉత్తర కాశీ, చమోలీ, పిథౌరీగఢ్ , అల్మోడా ప్రాంతాల్లో ఉన్న గ్లేసియర్లు వేగంగా కరుగుతున్నాయి. గంగోత్రి గ్లేసియర్ ఇందులో ఒకటి. ఇది అత్యంత వేగంగా కరుగుతోంది. జలవాయు మార్పులు గ్లేసియర్‌పై ప్రభావం చూపిస్తున్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా ఈ గ్లేసియర్లు వెనక్కి కుంగిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గణాంకాలు ఆందోళన కల్గిస్తున్నాయి. గత 15 ఏళ్లలో దాదాపుగా 0.23 స్క్వేర్ కిలోమీటర్ల గ్లేసియర్లు వెనక్కి జరిగాయి.
వాతావరణంలో మార్పు ప్రభావం హిమాలయ గ్లేసియర్లపై పడుతోంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 6 ప్రముఖ గ్లేసియర్లు ఉన్నాయి. ఉత్తరాఖండ్‌లో గ్లేసియర్ వేగంగా కరుగుతోంది. లడాఖ్, జమ్ము కశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌లలో ఉన్న గ్లేసియర్లు వేగంగా పెరుగుతున్నాయి.