Viral News Today: దండంరా నాయన.. అక్కడ ఏడాదికి ఒక్కరోజే స్నానం.. కానీ శరీరం నుంచి పర్ఫూమ్ స్మెల్ వస్తుందంట..
మనలో చాలా మంది రోజుకు రెండు సార్లు స్నానం చేస్తారు. ఆఫీసుకు వెళ్లేటప్పుడు ఉదయం చేస్తారు. ఆ తర్వాత రాత్రికి ఆఫీస్ నుంచి వచ్చాక అలసట పోయేందుకు స్నానం చేస్తుంటారు. కొందరు వేడినీళ్లు ఉపయోగిస్తే, చల్లని నీళ్లతో మరికొందరు స్నానంచేస్తారు.
ఇక సమ్మర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎండాకాలంలో దాదాపు అందరు రెండు సార్లు స్నానం చేస్తుంటారు. ఏవైన కారణాలతో ఒక రోజు స్నానం మిస్ అయితే... పక్కొడి పని ఐపోయినట్లే.. ఒంట్లో నుంచి వచ్చే చెమట కంపుతో వాడు దూరంగా పారిపోవాల్సిందే..
కానీ కొన్ని చోట్ల ఆచారాలు, సంప్రదాలు భిన్నంగా ఉంటాయి. ఇవి చూస్తే మాత్రం నోటి వెంబడి మాట రాదు. అచ్చం ఇలాంటి స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నమీబియాలో హింబా తెగకు చెందిన ప్రజలు ఉన్నారు. ఇక్కడ కొన్ని ఏళ్లుగా వెరైటీ ఆచారంను పాటిస్తున్నారు.
హింబా తెగ ప్రజలు స్నానం చేసే పద్ధతిలో ఒక విచిత్రమైన ఆచారం పాటిస్తారంట. ఈ తెగ ప్రజలు ఏడాదికి ఒక్కరోజు స్నానం చేస్తారంట. అది కూడా తమ పెళ్లిరోజున మాత్రమే ఫ్రెష్ గా స్నానం చేస్తారంట. ప్రస్తుతం ఈ తెగలో దాదాపు యూభై వేల మంది వరకు గిరిజనులు ఉన్నారంట. ఇక్కడ స్నానానికి వెరైటీ పద్ధతి ఫాలో అవుతారంట..
ఇక్కడ నిప్పులలో అడవి నుంచి సేకరించిన పరిమళ ద్రవ్యాలను వేస్తారంట. దీంతో సువాసనతో కూడా పొగవస్తుంది. ఈ పొగ తమ శరీరానికి గుండా పోయేలా చేస్తారంట..దీంతో శరీరంనుంచి దుర్వాసన అస్సలు రాదంట. ఈ స్నానం చేశాక.. ఒంట్లో నుంచి ప్రత్యేకమైన స్మెల్ వస్తుదంత. ఈ వాసనకు, కీటకాలు, పురుగులు కూడా దగ్గరకు రావంట..
అందుకే ప్రతి ఏడాది పెళ్లికి ఒకరోజు మాత్రమే స్నానం చేస్తూ.. మిగతా రోజుల్లో ఆడ, మగ తేడాలేకుండా ఇలా వెరైటీగా పొగ స్నానం చేస్తూ ఫెష్ గా ఉంటారంట. అదే విధంగా వీరి ఒంట్లో నుంచి అస్సలు స్మెల్ కూడా రాదంట.