Holi 2024: పెళ్లి కానీ ప్రసాద్ లకు బంపర్ ఆఫర్.. కామదహానం రోజు ఈ రెమిడీ పాటిస్తే నచ్చిన అమ్మాయితో వివాహాం..

Fri, 22 Mar 2024-3:07 pm,

ఈ మధ్య కాలంలో చాలా మంది యువత ముఖ్యంగా అబ్బాయిలు పెళ్లి కుదరక తెగ ఇబ్బందులు పడుతున్నారు. అమ్మాయిలకునచ్చే విధంగా ప్యాకేజీలు, ప్రాపర్టీలు లేక పెళ్లిళ్లు కాస్త ఆలస్యమవుతున్నాయి. దీంతో అబ్బాయిలు ఎక్కువ మంది పెళ్లికానీ ప్రసాద్ లుగానే మిగిలిపోతున్నారు.  

ముఖ్యంగా పెళ్లిళ్లు కుదరకపోవడానికి జ్యోతిష్య సమస్యలు, ఇంట్లో గతించినవారి శాపలు, జాతకంలో ఉన్న దోషాల మూలంగా పెళ్లిళ్ల సరైన ఏజ్ లో అస్సలు కుదరడం లేదు. ఈ క్రమంలో జ్యోతిష్యులు కొన్ని నియమాలు పాటించాలని చెబుతున్నారు.  

పెళ్లిళ్లు సెట్ కాకపోవడానికి కాలసర్పదోషం కూడా ఒక కారణమని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. రేపు అంటే శనివారం రోజున కామదహానంపండుగను ఎంతో వేడుకగా జరుపుకుంటాం. ఆ తర్వాత రోజును హోలీగా జరుపుకుంటారు..  

కామదహానం రోజు రాత్రి కట్టెలను పొగుచేసి ఒక చోట్ల మంటలను వేలిగిస్తారు. పెళ్లికానీ వారు ఈ మంటల దగ్గరకు వెళ్లి, పసుపు కొమ్ములను తీసుకుని మూడు సార్లు సవ్యదిశ (క్లాక్) లాగా, మూడు సార్లు అపసవ్య(యాంటీ క్లాక్) మాదిరిగా తిప్పాలి. ఆ తర్వాత.. అగ్నిచుట్టు మూడుసార్లు తిరగాలి. 

ఇలా తిరిగి ఆ దిష్టి తీసిన పసుపు కొమ్ములను మంటలలో వేయాలి. ఇలా చేస్తే మనకు ఉన్న దోషాలు పోయి వెంటనే పెళ్లి కుదురుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. పెళ్లిలో ఏర్పడే ఆటంకాలు కూడా దూరమౌతాయని చెబుతారు.

కామదహానం మరుసటిరోజున  ఆ భస్మంను ఇంటికి తెచ్చుకుని, పెట్టుకొవాలని ఇలాపెట్టుకుంటే జాతకంలో ఏర్పడిన దోషాలు, దిష్టిదోషాలు అస్సలు ఉండవని కూడా జ్యోతిష్యులు చెబుతుంటారు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link