Holidays 2024: వావ్.. ఎగిరిగంతేసే న్యూస్.. ఆగస్టులో వరుసగా ఐదురోజుల సెలవులు.. ఇలా ప్లాన్ చేసుకొండి..

Tue, 06 Aug 2024-9:13 am,

కొన్నిరోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులన్ని నీళ్లతో నిండుకుండలా మారాయి.  మరోవైపు శ్రావణ మాసం కూడా ప్రారంభమైంది. చాలా మంది ఈ సమయంలో ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ తో కలిసి నేచర్ ను ఎంజాయ్ చేయాలనుకుంటారు.

కొంత మంది టెంపుల్స్ కు టూర్లు ప్లాన్ లు చేసుకుంటే, మరికొందరు మాత్రం ఫ్రెండ్స్ తో వాటర్ ఫాల్స్, కొత్త ప్రదేశాలకు వెళ్లడానికి ఇంట్రెస్ట్ చూయిస్తుంటారు. ఈ నేపథ్యంో ప్రస్తుతం ఆగస్టు మాసంలో ఆగస్టు 15వ తేదీ నుంచి మొదలుపెట్టి ఆగస్టు 19వ తేదీ వరకు 5 రోజుల పాటు సెలవులు రానున్నాయి. కానీ ఒక్క రోజు మాత్రం కాస్తంతా డిఫరెంట్ గా ప్లాన్ చేసుకొవాల్సి ఉంటుంది. 

ఆగస్టు 15 నుంచి లాంగెస్ట్ వీకెంట్ వార్త ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ గా మారింది. ఒకవైపు శ్రావణం  ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. మరోవైపు పెళ్లిళ్లకు శుభమూహుర్తాలు కూడా ప్రారంభమయ్యాయి. చాలా మంది పెళ్లిళ్ల వేటల్లో బిజీ అయిపోయారు. పెళ్లికానీ వారు మంచి సంబంధం కోసం, పెళ్లి సెటిల్ అయిన వారు అరెంజ్ మెంట్స్ లో బిజీ అయిపోయారు. 

స్కూల్ విద్యార్థులు, గవర్నమెంట్ ఉద్యోగులకు ఎగిరిగంతేసే వార్తఅని చెప్పుకొవచ్చు.  15వ (గురువారం) తేదీన స్వాతంత్య్ర దినోత్సవం రోజున స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులున్నా.. అది జెండా వందనం మాత్రమే ఉంటుంది. ఆతర్వాత అందరు వెళ్లిపోతారు. కొన్ని ఆఫీసులు, కాలేజీలు అయితే ఆరోజును ముందే హాలీడే ప్రకటించేస్తారు. 

కాబట్టి.. ఆరోజు సెలవు కిందికే పరిగణలోకి వస్తుంది. ఆ తర్వాతి రోజున (ఆగస్టు 16న) శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం. ఆ రోజున చాలా వరకు స్కూళ్లు, ఆఫీసులకు సెలవు ప్రకటిస్తారు. ఈరోజున చాలా మంది అమ్మవారి పూజలు చేసుకుంటారు. దీంతో.. 15, 16 రెండు రోజులు విద్యార్థులు, ఉద్యోగులకు సెలవులు ఉండనున్నాయి. 

అలాగే.. ఆగస్టు 18 ఆదివారం కావటంతో ఎలాగూ హాలీడేనే.. ఇక 19వ తేదీన రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆరోజు కూడా స్కూళ్లు, కాలేజీలు, ఉద్యోగులకు సెలవు ఇవ్వనున్నారు. దీంతో.. మరో రెండు రోజులు సెలవులు కామన్ గా ఉండేవే. అయితే.. 15, 16, 18, 19 ఎలాగు సెలవులు ఉన్నాయి. 

మధ్యలో ఆగస్టు 17 (శనివారం) ఒక్క రోజు మాత్రమే వర్కింగ్ డే ఉంటుంది. అది కూడా స్కూళ్లు, కాలేజీలు, కొన్ని కంపెనీలకు మాత్రమే. ఇక సాఫ్ట్ వేర్ ఉద్యోగుల విషయానికి వస్తే శనివారం ఎలాగు వీకెండ్‌. వారికి సెలవే ఉంటుంది. అయితే.. 17 రోజున ఆఫీసు కానీ, స్కూళ్లు, కాలేజీలు ఉన్న వాళ్లు ఆ ఒక్క రోజున సిక్ లీవ్ కానీ, హాలీడే గానీ తీసుకుంటే.. వరుసగా 5 రోజులు సెలవులు కలిసి వస్తాయి.

ఈ నేపథ్యంలో.. లాంగ్ వీకెండ్ దొరుకుంది. దీంతో కొత్త ప్రదేశాలకు, దూర ప్రాంతాలను సందర్శించడానికి ఇంతకన్నా.. మంచిగా సెలవులు ఉండవని కూడా చాలా మంది భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ లాంగెస్ట్ వీకాఫ్ వార్త మాత్రం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.  కానీ ఇది ఆయా కాలేజీలు, కంపెనీలకు అనుగుణంగా సెలవులు మారుతుంటాయి.  (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link