Home Loan Mistakes: హోమ్ లోన్ తీసుకుంటున్నారా, అయితే ఈ 5 తప్పిదాలు చేయవద్దు
రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారం, బ్యాంకులు ప్రాపర్టి విలువ ఆధారంగా అందులో మొత్తం ఆస్తి విలువలో 75-90% వరకు రుణాలు అందిస్తుంది. క్రెడిట్ రిస్క్ అసెస్‌మెంట్ ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటారు. హోమ్ లోన్ తీసుకునేవారు మిగిలిన మొత్తాన్ని ఇతర వనరుల నుండి డౌన్ పేమెంట్ (Down Payment) లేదా మార్జిన్ కంట్రిబ్యూషన్ రూపంలో తీసుకోవాలి. హోమ్ లోన్ దరఖాస్తుదారులు తమ ఆస్తి విలువలో కనీసం 10-25% పొందడం ద్వారా రుణాల మొత్తం పెంచుకోవాలి. డౌన్ పేమెంట్ పెరగడం మరియు లోన్ అప్లికేషన్‌ను ఆమోదించే అవకాశం పెరిగేకొద్దీ బ్యాంకులు, రుణాలు అందించే సంస్థలకు సైతం ప్రమాదం తగ్గుతుంది. తక్కువ వడ్డీ రేట్లు కూడా రుణగ్రహీతలకు కొంత ఉపశమనం కలిగిస్తాయి. డౌన్‌పేమెంట్ మొత్తాన్ని పెంచడంలో భాగంగా, ఎమర్జెన్సీ ఫండ్ లేదా ఏదైనా పెట్టుబడుల కోసం సిద్ధం చేసుకున్న నగదును మాత్రం ఖర్చు చేయకూడదని గుర్తుంచుకోండి.
Also Read: Tata Motors Hikes Car Prices: కార్ల ధరలు పెంచేసిన టాటా మోటార్స్, లేటెస్ట్ రేట్లు ఇవే
హోమ్ లోన్ అప్లికేషన్ స్వీకరించేటప్పుడు బ్యాంకులు, ఇతర రుణదాతలు క్రెడిట్ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. 750 కంటే ఎక్కువ క్రెడిట్ స్కోరు కలిగి ఉన్న దరఖాస్తుదారుల Home Loan దరఖాస్తును ఆమోదించే అవకాశం ఉంది. కనుక ఇంటి కోసం రుణాలకు వెళుతున్నప్పుడు మీ క్రెడిట్ స్కోరు ఎంత ఉందో కచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీ క్రెడిట్ స్కోరు మరీ తక్కువగా ఉంటే మీ హోమ్ లోన్ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయి. క్రెడిట్ స్కోరు మెరుగైన తరువాతే మీరు రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాలని మరిచిపోకూడదు.
హోమ్ లోన్ వడ్డీరేట్లు, ఆఫర్లు చెక్ చేసుకోవడం ముఖ్యం. రుణాలు తీసుకునే వారి క్రెడిట్ ప్రొఫైల్‌తో పాటు, వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు, తిరిగి చెల్లించే కాలం మరియు ఎల్‌టివి రేట్లు ఒక్కో బ్యాంకులు లేదా రుణాలిచ్చే సంస్థలకు భిన్నంగా ఉంటాయి. కనుక Home Loan దరఖాస్తు చేయడానికి ముందుగా, పలు బ్యాంకులు, సంస్థల వడ్డీ రేట్లు, వారు అందిస్తున్న ఆఫర్లు, లోన్ చెల్లించాల్సిన పూర్తి వివరాలు తెలుసుకోవాలి. ఆన్‌లైన్‌లో మీరు ఒక్కో బ్యాంకు లేదా రుణదాత సంస్థల పేర్లతో రుణాలతో పాటు వడ్డీ రేట్లు పూర్తిగా తెలుసుకునే అవకాశం ఉందని గ్రహించాలి. తద్వారా తక్కువ వడ్డీ వసూలు చేసే బ్యాంకులో హోమ్ లోన్ తీసుకోవచ్చు.
Also Read: EPFO: ఒక్క మిస్డ్ కాల్ ద్వారా మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు EPF Balance పూర్తి వివరాలు
EMI చెల్లింపు సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తారు. ఇంటి లోన్ తీసుకునేందుకు దరఖాస్తు చేసుకున్న వారు తిరిగి చెల్లించే అవకాశాలను రుణదాతలు పరిశీలిస్తారు. నెలవారీ చెల్లించే ఈఎంఐ సామర్థ్యాన్ని సైతం బ్యాంకులు, రుణదాతలు అంచనా వేస్తారు. ఉద్యోగులైతే వారి నెలవారీ ఆదాయంలో 50-60 శాతం EMIకి చెల్లించే సామర్థ్యాన్ని చెక్ చేస్తారు. వ్యాపారులైతే వారి ఆదాయాన్ని ఆధారంగా చేసుకుని హోమ్ లోన్ అప్లికేషన్‌ను ఆమోదిస్తారు. గతంలో ఏవైనా రుణాలు తీసుకున్నారా, తీసుకుంటే వాటికి చెల్లించే ఈఎంఐతో కలిపి ప్రస్తుత హోమ్ లోన్ ఈఎంఐ వివరాలు కలిపి పరిశీలిస్తారు. తద్వారా మొత్తం EMI చెల్లింపులు 50-60 శాతం పరిమితిని మించకుండా ఉంటే వారి లోన్ ఆమోదం పొందుతుంది.
Also Read: SBI Alert: ఆ పని చేయకపోతే అకౌంట్ సేవలు బంద్, ఖాతాదారులకు SBI అలర్ట్
మీరు తీసుకునే గృహ రుణాలు EMIలను ఆకస్మిక నిధి ద్వారా ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లించకూడదు. కొన్ని సందర్భాలలో ఉపాధి కోల్పోవడం, అనారోగ్యం, ఏదైనా ఇతరత్రా కారణాలతో మీరు చెల్లించలేని సందర్భాలలో మాత్రమే మీ ఎమర్జెన్సీ ఫండ్ నుంచి ఈఎంఐ చెల్లించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉద్యోగం, వ్యాపారం లాంటి సజావుగా సాగుతున్న సమయంలో లోన్ వాయిదాలు చెల్లించడం తేలిక అవుతుంది. కానీ పైన తెలిపిన కొన్ని సందర్భాలలో ఈఎంఐ సరైన సమయంలో చెల్లించని పక్షంలో భారీ జరిమానా చెల్లించాల్సి వస్తుంది. దాంతోపాటు లోన్ తీసుకునే వారి క్రెడిట్ స్కోర్ తగ్గి ప్రతికూల ప్రభావం చూపుతుంది. కనీసం 6 నెలలపాటు ఈఎంఐ చెల్లించే విధంగా ఎమర్జెన్సీ ఫండ్‌లో నగదు నిల్వ ఉంచుకోవాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook