Tata Motors Hikes Car Prices: కార్ల ధరలు పెంచేసిన టాటా మోటార్స్, లేటెస్ట్ రేట్లు ఇవే

టాటా మోటార్స్ తమ కంపెనీ కార్ల ధరలను అమాంతం పెంచేసింది. రూ.10,000 నుంచి 36000 వరకు వేరియంట్, మోడల్‌ను బట్టి కార్ల ధరలు పెరిగాయి. టాటా టియాగో, టాటా అల్ట్రాజ్, టాటా నెక్సాన్, టాటా సఫారీ ఎస్‌యూవీ మోడల్స్ ధరలు ఇలా ఉన్నాయి..
  • May 09, 2021, 17:32 PM IST

Tata Motors Hikes Car Prices : టాటా మోటార్స్ తమ కంపెనీ కార్ల ధరలను అమాంతం పెంచేసింది. రూ.10,000 నుంచి 36000 వరకు వేరియంట్, మోడల్‌ను బట్టి కార్ల ధరలు పెరిగాయి. టాటా టియాగో, టాటా అల్ట్రాజ్, టాటా నెక్సాన్, టాటా సఫారీ ఎస్‌యూవీ మోడల్స్ ధరలు ఇలా ఉన్నాయి..

1 /6

Tata Motors Hikes Car Prices : టాటా మోటార్స్ తమ కంపెనీ కార్ల ధరలను అమాంతం పెంచేసింది. రూ.10,000 నుంచి 36000 వరకు వేరియంట్, మోడల్‌ను బట్టి కార్ల ధరలు పెరిగాయి. టాటా టియాగో, టాటా అల్ట్రాజ్, టాటా నెక్సాన్, టాటా సఫారీ ఎస్‌యూవీ మోడల్స్ ధరలు ఇలా ఉన్నాయి..

2 /6

టాటా టియాగో (Tata Tiago) ప్రాథమిక మోడల్ XE ధర రూ.4.99 లక్షలు. అదే మోడల్ కారును రూ.4.85 లక్షలకు విక్రయిస్తున్నారు. ఢిల్లీలోని ex-showroomలో రెండు ధరలకు విక్రయాలు జరుగుతున్నాయి.  ఇందులో టాప్ మోడల్ XZA+ Dual Tone ధర రూ.6.95 లక్షలు (ex-showroom Delhi). గతంలో విక్రయాల కంటే ఇది రూ.11,000 అధికం.

3 /6

కార్ల ప్రియులు కొనేందుకు ఆసక్తి చూపించే మోడళ్లలో టాటా అల్ట్రాజ్ ఒకటి. ఈ మోడల్ ధర సైతం పెరిగింది. బేస్ మోడల్‌ను రూ.5.79 లక్షలకు విక్రయిస్తున్నారు. గతంలో దీని ధర రూ.5.69 లక్షలు ఉండగా, ప్రస్తుతం రూ.10,000 ధర పెరిగింది.  టాటా XZ Plus Diesel మోడల్ ధర రూ.9.55 లక్షలకు చేరింది. అయినా విక్రయాలు జోరందుకున్నాయి.

4 /6

టాటా కంపెనీ టాటా టైగోర్ ధర రూ.10,000 మేర పెంచింది. టాప్ మోడల్ XZA Plus కార్లను ఇప్పుడు రూ.7.73 లక్షలకు విక్రయిస్తున్నారు. ఇందులోని బేస్ మోడల్ XE సైతం రూ.10,000 మేర పెరగడంతో రూ.5.59 లక్షలకు విక్రయాలు జరుగుతున్నాయి.

5 /6

టాటా నెక్సాన్ బేస్ మోడల్ సైతం ధర పెరిగింది. రూ.10 వేలు మేర ధర పెరగడంతో ప్రస్తుతం  రూ.7.19 లక్షలకు బేస్ మోడల్ విక్రయిస్తున్నారు. ఇందులో టాప్ ఎండ్ మోడల్ XZA+ (O) Dual Tone రూ. 16,000 మేర భారీగా ధర పెరిగింది. ప్రస్తుతం రూ.12.95 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

6 /6

టాటాలో కొత్తగా లాంచ్ అయిన మోడల్ సఫారీ SUV ధర సైతం రూ.30,000 మేర పెంచారు. దీంతో ప్రస్తుతం రూ.14.99 లక్షలకు విక్రయిస్తున్నారు. టాప్ మోడల్ XZA Plus రూ.21.61 లక్షలకు కొనుగోలు చేయవచ్చునని టాటా సంస్థ తెలిపింది.