మార్కెట్‌లోకి కొత్త Honda Activa 6G.. పెట్రోల్ ఇక 10 శాతం ఆదా..
హోండా యాక్టివా 6జి స్టాండర్డ్, హోండా యాక్టివా 6జి డిలక్స్ అనే రెండు వేరియెంట్స్‌లో ఈ యాక్టివా 6జి స్కూటర్ లభించనుంది.
హోండా యాక్టివా 6జి స్టాండర్డ్ మోడల్ ఎక్స్-షోరూం ధర రూ.66,816 కాగా హోండా యాక్టివా 6జి డిలక్స్ ధర రూ.68,316గా ఉంది.
గత రెండు దశాబ్ధాలుగా 2 కోట్లకు పైగా యాక్టివా విక్రయాలు జరిపినట్లు కంపెనీ స్పష్టంచేసింది. ఇది కేవలం కంపెనీపై వినియోగదారులకు ఉన్న నమ్మకం వల్లే సాధ్యమైందని హోండా ఇండియా అభిప్రాయపడింది.
BS6 మోడల్‌తో వస్తున్న యాక్టివా 6జి స్కూటర్ 110cc సామర్ధ్యం ఇంజిన్ కలిగి ఉంది.
ఇందులో ఉన్న హోండా ఇకో టెక్నాలజీ సాయంతో 10 శాతం ఇంధనం ఆదా చేయవచ్చని హోండా కంపెనీ చెబుతోంది.
హోండా యాక్టివా 6జిలో 26 కొత్త పేటెంట్ అప్లికేషన్స్ తీసుకొస్తున్నట్టు హోండా ఇండియా కంపెనీ వెల్లడించింది. ఎప్పటికప్పుడు రాబోయే రోజుల్లో అవసరమైన అధునాతన టెక్నాలజీని అంతకంటే ముందే ప్రవేశపెట్టేందుకు తమ కంపెనీ అన్ని ప్రయత్నాలు చేస్తుందని హోండా ఇండియా అభిప్రాయపడింది.