Honda Activa Ev 2024: స్కూటర్‌ అంటే ఇదే కాదా.. రూ.1 లక్షకే 104 కిమీల మైలేజీనిచ్చే Honda Activa Ev స్కూటర్..

Fri, 22 Nov 2024-12:27 pm,

త్వరలోనే మార్కెట్‌లోకి హోండా యాక్టివా ఎలక్ట్రిక్ (Honda Activa Ev 2024) స్కూటర్‌ విడుదల కాబోతోంది. ఇది అద్భుతమైన రెండు రైడ్‌ మోడ్‌లో లాంచ్‌ కానుంది. అంతేకాకుండా ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది.

హోండా కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం, ఈ స్మార్ట్‌ స్కూటర్‌ 104 కిమీల రేంజ్‌ను అందిస్తుంది. అంతేకాకుండా స్పెషల్ స్పోర్ట్స్‌ మోడ్‌లను కూడా అందిస్తోంది. ఇవే కాకుండా అనేక రకాల ఫీచర్స్‌ లభించనున్నాయి.

హోండా యాక్టివా ఎలక్ట్రిక్ ఫీచర్లు వివరాల్లోకి వెళితే.. ఇది బైక్‌ నడిపే విధాన్ని బట్టి ఆటో రైడింగ్‌ మోడ్‌లను సెలక్ట్ చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ (Honda Activa Ev 2024) బైక్‌కి ఫ్రంట్‌ భాగంలో ప్రత్యేకమైన డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.   

ఈ యాక్టివా ఎలక్ట్రిక్ వేరియంట్‌ ప్రత్యేకమైన రైడర్ ఇంటిగ్రేటెడ్ నావిగేషన్ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. అంతేకాకుండా ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు ప్రత్యేకమైన కొన్ని కొత్త ఫీచర్స్‌ కూడా రాబోతున్నాయి.

ఇక ఈ హోండా యాక్టివా ఎలక్ట్రిక్ (Honda Activa Ev 2024) వేరియంట్స్‌ ధర రూ.1లక్ష 20 వేల నుంచి ప్రారంభం కాబోతోంది. అలాగే ప్రత్యేకమైన బ్లూతుట్‌ కనెక్టీవిటీని కూడా అందిస్తోంది. దీని ద్వారా సులభంగా బైక్‌ను కంట్రోల్ చేయోచ్చు.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link