Honda Electric Scooter : హోండా ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేస్తోందోచ్..మైలేజీలో రారాజు..ఫీచర్స్‎లో అదుర్స్..భారత్‎లో లాంచ్ ఎప్పుడంటే?

Sat, 09 Nov 2024-8:22 am,

Honda Electric Scooter : ప్రముఖ టూవీలర్ వెహికల్ తయారీదారు సంస్థ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా నుంచి మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ త్వరలోనే భారత్ లో లాంచ్ కాబోతోంది. ఈ నెల 27న దేశ మార్కెట్లో మొదటి ఎలక్ట్రిక్ మోడల్ ను విడుదల  చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

 యాక్టివా, డియో వంటి మోడల్స్ కు పోటీగా ఇంటర్నల్ దహన ఇంజిన్ స్కూటర్ సెగ్మెంట్లో హోండా మొదటి ఎలక్ట్రిక్ మోడల్ స్కూటర్ గా రానుంది. భారత మార్కెట్లో మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ ఇప్పటికే ప్రారంభ దశలోనే ఉందన్న సంగతి తెలిసిందే.   

 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఏ పేరుతో వస్తుందనే దానిపై హోండా ఇంకా ప్రకటించలేదు. అయితే మీడియా కథనాల ప్రకారం.. కొత్త స్కూటర్ Activa EV అవుతుంది. అయితే ఇది పూర్తిగా కొత్త డిజైన్, ఫీచర్లతో మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది.  ప్రస్తుతం ఉన్న పెట్రోల్ స్కూటర్‌తో పోలిస్తే, ఇది మరింత లెటేస్ట్, హైటెక్ ఫీచర్‌లతో రానుంది.

గతేడాది..ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో రెండు కొత్త ఉత్పత్తులను విడుదల చేయడం గురించి హోండాకు సమాచారం అందింది. వీటిలో ఒకటి ఫిక్స్‌డ్ బ్యాటరీతోనూ, మరొకటి తొలగించగల బ్యాటరీతోనూ తీసుకొచ్చినట్లు సమాచారం. అయితే భారత్‌లో విడుదల చేయనున్న తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఫిక్స్‌డ్ బ్యాటరీ అమర్చి ఉంటుందని భావిస్తున్నారు.రానున్న రోజుల్లోనే  తొలగించగల బ్యాటరీతో కూడిన స్కూటర్‌ను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు కంపెనీ పేర్కొంది.   

ఈమధ్యే హోండా తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను EICMA 2024లో పరిచయం చేసింది. హోండా  ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు శక్తినివ్వడానికి రెండు తొలగించగల బ్యాటరీ ప్యాక్‌లు ఉపయోగించింది. ఫుల్‌ ఛార్జింగ్‌పై 70 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనున్నట్టు కంపెనీ పేర్కొంది. ఈ మోడల్  గత సంవత్సరం టోక్యో మోటార్ షోలో కూడా ప్రదర్శించింది. 

ప్రస్తుతానికి ఈ స్కూటర్ ధరకు సంబంధించి ఎలాంటి సమాచారం అందలేదు. పలు మీడియా లీక్స్ ను బట్టి ఈ స్కూటర్ ధర సుమారు లక్ష రూపాయలు ఉండవచ్చు. ఈ స్కూటర్ డిజిటల్ డిస్‌ప్లేతోపాటు లేటెస్ట్ ఫీచర్స్ ఎన్నో ఈ స్కూటర్ లో ఉన్నాయి. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link