Aadhar card: మీ ఆధార్ కార్డుపై ఎన్ని సిమ్ కార్డ్స్ రిజిస్టర్ అయి ఉన్నాయో ఇలా తెలుసుకోండి..

Sun, 14 Jul 2024-5:13 pm,

ఇటీవలే ఒక చంఢిఘఢ్‌ మహిళ సిమ్ కార్డ్ స్కామ్ లో భాగంగా రూ. 80 లక్షలు పోగొట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ సైబర్ క్రైమ్ దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. సైబర్ నేరగాళ్లు ఆ మహిళను మోసగించి ఈ డబ్బులను రాబట్టారు. తన ఫోన్‌ నంబర్‌ ఓ చట్టవిరుద్ధమైన కార్యకలాపాల్లో ఉన్నట్లు తేలిందని పోలీసు ఆఫీసరు కాల్‌ చేసినట్లు మభ్యపెట్టారు.   

తనపై కేస్‌ బుక్‌ అవుతుందని బెదిరిచడంతో ఆ మహిళ రూ.80 లక్షల వరకు డబ్బును ఆ నేరగాళ్ల ఖాతాల్లో జమా చేసింది. అయితే డిపార్ట్మెంట్ టెలికమ్యూనికేషన్ గైడ్లైన్స్ ప్రకారం ఒక ఆధార్ ఐడి పైన 9 సిమ్ కార్డ్స్ తీసుకోవచ్చు.  

ఆధార్ కార్డు మనం దేశవ్యాప్తంగా ఉపయోగిస్తున్నాం ఇది మన గుర్తింపు కోసం. ఆధార్ కార్డు ఉంటేనే సిమ్ కార్డును జారీ చేస్తారు అయితే కొంతమంది ఆధార్ కార్డును ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో ఉపయోగిస్తున్నారు. DOT ఓ పోర్టల్‌ను ప్రారంభించింది. తద్వారా నేరాలను అరికట్టవచ్చని ఈ వెసులుబాటు కల్పించింది. టెలికాం అనలిటిక్స్‌ ఆఫ్‌ ఫ్రాడ్‌ మేనేజ్మెంట్‌ అండ్‌ కన్‌జ్యూమర్‌ ప్రొటెక్షన్‌(TAF-COP) ఇది మన ఆధార్‌ కార్డుతో ఎన్ని మొబైల్ నంబర్స్‌ ఉన్నాయో సులభంగా తెలుసుకునే అవకాశం కల్పించింది.  

ఇలా తెలుసుకోండి.. మీ ఆధార్‌ కార్డుపై ఎన్ని సిమ్‌ కార్డులు రిజిస్టర్‌ అయి ఉన్నాయో తెలుసుకోవాలంటే TAFCOP అధికారిక వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేయాలి https:tafcop.sacharsaathi.gov.in/telecomUser/ ఆ తర్వాత మీ మొబైల్‌ నంబర్‌ ఇచ్చిన బాక్స్‌లో ఎంటర్‌ చేయాలి.

ఇప్పుడు క్యాప్చా ఎంటర్‌ చేస్తే ఓటీపీ రిక్వెస్ట్‌ అడుగుతుంది. ఓటీపీ నమోదు చేసి లాగిన్‌ అవ్వాల్సి ఉంటుంది. అక్కడ మీరు మొబైల్‌ నంబర్‌ లిస్ట్‌ గమనిస్తారు. ఇవి మీ ఆధార్‌ కార్డుకు లింక్‌ అయి ఉంటాయి.  ఈ అన్ని నంబర్స్‌ యాక్టీవ్‌లో ఉన్నాయో లేదో తెలుసుకోండి అవి మీకు సంబంధించవా కావా? అని చూడండి మీకు ఏదైనా సందేహం ఉంటే వెబ్‌సైట్‌లో మూడు ఆప్షన్స్‌ ఉంటాయి, 'Not my number', 'Not required', Required'.

మీకు సంబంధం లేని నంబర్లు బ్లాక్‌ చేసే సదుపాయం TAF-COP కల్పిస్తుంది. మీకు సంబంధంలేకుంటే 'Not my number పై క్లిక్ చేయండి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link