Mutual Funds: నెలకు 1000 రూపాయలు జమ చేస్తే చాలు.. కోటీశ్వరుడు అవడం ఎలాగో తెలుసుకుందాం
Mutual Funds Investment: కొత్తగా ఉద్యోగంలో చేరారా? అయితే మీ డబ్బును ఎలా ఆదా చేయాలి అని ఆలోచిస్తున్నారా? ఇందుకోసం ఓ చక్కటి ఆప్షన్ మీ ముందు ఉంది. సాధారణంగా వచ్చిన డబ్బును బ్యాంకుల్లో దాచుకుంటే వాటిపైన వడ్డీ లభిస్తుంది. అలాగే ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసుకుంటే అత్యధిక మొత్తంలో వడ్డీ లభిస్తుంది. కానీ సాంప్రదాయ బ్యాంకింగ్ సిస్టంలో డబ్బు దాచుకోవడం కన్నా మ్యూచువల్ ఫండ్స్ లో మీరు డబ్బు దాచుకుంటే పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చని మీరు రిటైర్మెంట్ నాటికి ఆదాయం లేకపోయినప్పటికీ, వచ్చిన ఫండ్ తోనే మీరు మిగతా జీవితాన్ని సులభంగా వెళ్లదీయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ముఖ్యంగా ప్రతి నెల కేవలం 1000 రూపాయలు సిప్ అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ప్రకారం ప్రతినెల ఇన్వెస్ట్ చేసినట్లయితే మ్యూచువల్ ఫండ్స్ లో ఎంత డబ్బు ఆదా చేయవచ్చు. వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఉదాహరణకు మీకు 20 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ప్రతి నెల 1000 రూపాయలు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే సిప్ (SIP) రూపంలో ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసినట్లయితే, మీరు ఎంత మొత్తం డబ్బు సంపాదించవచ్చు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఇప్పుడు సిప్ క్యాలిక్యులేటర్ ద్వారా ఒక అంచనా చూద్దాం. మీ వయసు 20 సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రతి నెల 1000 రూపాయలు సిప్ ఇన్వెస్ట్మెంట్, 40 సంవత్సరాలు చేసినట్లయితే అంటే మీ వయసు 60 సంవత్సరాలు వచ్చేనాటికి, దాదాపు ఒక కోటి 18 లక్షల రూపాయలు పెద్ద మొత్తంలో మీరు కార్పస్ ఫండ్ ను ఏర్పాటు చేసుకోవచ్చు.
ఇందులో మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తం పైన సంవత్సరానికి 12 శాతం రాబడి అంచనా వేసుకున్న మీరు పెట్టుబడి పెట్టిన దానిపైన చాలా రెట్లు లాభం లభిస్తుంది. ప్రతినెల 1000 రూపాయల చొప్పున 40 సంవత్సరాలు మీరు పెట్టుబడి పెడితే మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తం విలువ కేవలం రూ. 4,80,000 మాత్రమే కానీ దీనిపైన మీకు వచ్చే రాబడి 1,14,02,420 రూపాయల వరకు ఉంటుంది.
మొత్తం విలువ చూస్తే 1,18,82,420 రూపాయల వరకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఫండ్ పనితీరు పైన ఇది మొత్తం ఆధారపడి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.
మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేసే ముందు సర్టిఫైడ్ నిపుణుల వద్ద సలహా పొందడం తప్పనిసరి. జీ తెలుగు న్యూస్ వెబ్ పోర్టల్ ఎలాంటి ఆర్థిక పెట్టుబడి సలహాలు ఇవ్వదు.