Retiring Rooms: గ్రేట్‌న్యూస్, కేవలం 100 రూపాయలకే రిటైరింగ్ రూమ్ సౌలభ్యం, బుకింగ్ ఎలా చేసుకోవాలంటే
రిటైరింగ్ రూమ్స్ అనేవి ఏసీ, నాన్ ఏసీ రెండు విభాగాల్లో ఉంటాయి. సింగిల్, డబుల్, డార్మిటరీల్లో లభిస్తాయి. మనకు కావల్సింది ఎంచుకోవచ్చు.
ఇక్కడ కన్పించే వివరాలు ఎంటర్ చేసి రూమ్ బుక్ చేసుకోవచ్చు. మీ వ్యక్తిగత సమాచారంతో పాటు ప్రయాణ తేదీ సమాచారం నమోదు చేయాలి. పేమెంట్ ఆన్‌లైన్‌లో చెల్లించిన తరువాత రూమ్ బుకింగ్ పూర్తవుతుంది.
రూమ్స్ బుక్ చేసుకోవాలంటే ముందుగా ఐఆర్‌సీటీసీ ఎక్కౌంట్‌లో లాగిన్ అవాలి. మై బుకింగ్ ఆప్షన్ నుంచి రిటైరింగ్ రూమ్ ఆప్షన్ ఎంచుకోవాలి.
రైల్వే స్టేషన్ సమీపంలోని హోటల్స్ కంటే రిటైరింగ్ రూమ్స్ బెస్ట్ ఆప్షన్, ఎందుకంటే ఇందులో హోటల్స్‌ను పోలిన గదులే తక్కువ ధరకు లభిస్తాయి. ఐఆర్‌సీటీసీ ద్వారా ఆన్‌లైన్ బుకింగ్ చేసుకోవచ్చు. వీటిలో రూమ్స్ టారిఫ్ కేవలం 100 రూపాయల నుంచి 700 రూపాయులుంటుంది. ఏసీ హోటల్ రూమ్స్‌లో ఉన్నట్టే అన్ని వస్తువులు, సౌకర్యాలు ఉంటాయి.
దేశంలోని చాలా రైల్వే స్టేషన్లలో రిటైరింగ్ రూమ్స్ సౌకర్యం ఉంది. టికెట్ బుక్ చేసేటప్పుడే దీనికి సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంటుంది. చాలా తక్కువ ధరలోనే అత్యంత సౌకర్యవంతమైన రూమ్స్ పొందవచ్చు.