Ditect Hidden cameras: హోటల్స్ లో, బాత్రూమ్ లలో సీక్రెట్ కెమెరాల అనుమానామా..?.. ఇలా ఈజీగా కని పేట్టేయోచ్చు..
కొత్తగా లాడ్జీలకు వెళ్లినప్పుడు లేదా మాల్స్ లలో బట్టలు మార్చుకునేందుకు వెళ్లినప్పుడు మాత్రం మహిళలు, అమ్మాయిలు ఎంతో అలర్ట్ గా ఉండాలి. ఇటీవల కాలంలో కేటుగాళ్లు బట్టలు మార్చుకునే గదిల్లో, బాత్రూమ్ లలో, లాడ్జీల గదిలో రహస్య కెమెరాలను పెడుతున్నారు.
లాడ్జీలలో,కొత్త ప్రదేశాలలో వెళ్లినప్పుడు ముందుగా గదిలోకి వెళ్లి అక్కడ లైట్లన్ని ఆఫ్ చేయాలి. గదిని వీలైనంతగా చీకటిగా అయ్యేలా చూసుకొవాలి. అప్పుడు.. చీకటిలో ఎక్కడైన చిన్నగా లైటింగ్ ఏమైన ఉందా.. అని గమనించాలి. హిడెన్ కెమెరాలలైటింగ్ బ్లింక్ అవుతుంటుంది.
అంతేకాకుండా.. హోటల్స్ గదిలో పుస్తకాలు, పూలకుండీలు, బల్బులు, ఇతర వస్తువులు ఉంటే.. వాటినిజాగ్రత్తగా గమనించారు. వాటిలో కూడా హిడెన్ కెమెరాలను అమర్చే చాన్స్ ఉంటుంది.
బాత్రూమ్ లకు వెళ్లినప్పుడు..వాష్ బేసిన్ కు ముందు, డోర్ కు ఏమైన.. కెమెరాలు లేదా మరేదైన వస్తువులు ఉన్నాయా చూసుకొవాలి. బట్టలు మార్చుకునే ముందు గది అంతా జాగ్రత్తగా చెక్ చేసుకొవాలి.
గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్‌లో హిడెన్ కెమెరా డిటెక్టర్ యాప్‌లు ఉంటాయి. అవి కూడా రహస్య కెమెరాలను స్కాన్ చేసి కనిపెడతాయి. ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని, ఓపెన్ చేస్తే, ఆటోమేటిక్‌గా అది ఫోన్ కెమెరాని ఉపయోగించుకొని, రహస్య కెమెరాలను ఇట్టే పట్టేస్తాయి
అంతేకాకుండా.. మీకు మీరుగా మొబైల్ ఫోన్ ఫ్లాష్ లైట్ వేసి కూడా సీక్రెట్ కెమెరాలను కనిపెట్టవచ్చు. గదిలోకి వెళ్లాక ఫ్లాష్ లైట్ ఆన్ చెయ్యాలి. గదిలోని అద్దాలు, స్మోక్ డిటెక్టర్, వాల్ పెయింట్ లు, పూల బొకే, ఇతర వస్తువుల్ని జాగ్రత్తగా గమనించాలి. ఫ్లాష్ లైట్ పడగానే, కెమెరాల లెన్స్‌పై పడినప్పుడు.. వెంటనే ఆ కెమెరా మీకు కనిపిస్తుంది. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)