Ammavodi Status: జగనన్న అమ్మ ఒడి స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి

Tue, 12 Jan 2021-12:43 pm,

1వ తరగతి నుండి ఇంట‌ర్ వ‌ర‌కు చ‌దువుతున్న విద్యార్థుల త‌ల్లులంద‌రికీ జ‌గ‌న‌న్న అమ్మఒడి పథకం కింద రూ.15,000 ఆర్థిక సాయం అందిస్తున్నారు. అయితే తల్లుల ఖాతాల్లోకి రూ.14,000 జమ చేస్తున్నట్లు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) తెలిపారు. మిగతా వెయ్యి రూపాయాలు విద్యార్థుల సౌకర్యాల కోసం విద్యాసంస్థల్లో ఖర్చు చేయనున్నామని స్పష్టం చేశారు.

44,48,865 మంది తల్లుల ఖాతాల్లోకి రూ.14వేలు చొప్పున రూ.6,673 కోట్లు జమచేశారు. ఈ ఏడాది 'జగనన్న అమ్మఒడి'(Jaganna Ammavodi Scheme)  ద్వారా 84 లక్షలమంది పిల్లలు లబ్దిపొందనున్నారు. అయితే మీకు అమ్మఒడి వర్తిస్తుందా లేదా.. మీ అమ్మ ఒడి స్టేటస్‌ తెలుసుకుంటే మీకు నగదు వస్తుందా లేదా అనేదానిపై స్పష్టత ఉంటుంది.

Also Read: Lowest Interest Rate: పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి

మొదట అధికారిక వెబ్‌సైట్ https://jaganannaammavodi.ap.gov.in/ లోకి వెళ్లండి.  ఆ తర్వాత ‘SEARCH CHILD DETAILS FOR AMMAVODI 2020-21’ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి

ఆ తర్వాత జిల్లాకు సంబంధించిన వివరాల కోసం అడిగిన లింక్ మీద క్లిక్ చేయండి. వేరే పేజీ ఓపెన్ అవుతుంది.  ఆపై మీ జిల్లాను సెలక్ట్ చేసుకోండి

Also Read: EPF Interest Rate: ఈపీఎఫ్ వడ్డీ ఖాతాకు రాలేదా.. ఇలా ఫిర్యాదు చేయండి

విద్యార్థి తల్లి ఆధార్ నెంబర్/ విద్యార్థి ఆధార్ నెంబర్/ చిన్నారి ఐడీ నెంబర్ ఎంటర్ చేయాలి. అనంతరం Get Details ఆప్షన్‌ను క్లిక్ చేయాలి.  ఆ తల్లుల అమ్మ ఒడి స్టేటస్‌తో పాటు విద్యార్థి వివరాలు కనిపిస్తాయి.

ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ముందుగా చెప్పినట్లుగానే అమ్మ ఒడి పథకం అమలయింది. ఒకటి నుంచి ఇంటర్ చదివే విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేశారు. మీరు మీ స్టేటస్ తెలుసుకునే విధానాన్ని ఇక్కడ అందించాం.

Also Read: EPFO శుభవార్త.. మీ PF రెట్టింపు చేసుకోండి.. మరెన్నో లాభాలు! 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link