Android Smartphone: మీ మొబైల్ పోయిందా, దాన్ని కనుగొని Data Erase చేయడానికి ఇది చదవండి

Wed, 17 Mar 2021-11:11 am,

మీరు మీ ఫోన్‌ను పోగొట్టుకున్నారా, అయితే డేటా ఏమవుతుందని ఆలోచిస్తున్నారా? భయపడవద్దు.. అదృష్టవశాత్తూ మీ Android ఫోన్‌ను రిమోట్‌గా కనుగొని గుర్తించవచ్చు. ఫోన్‌ను లాక్ చేయడం మరియు మొత్తం డేటాను తొలగించడం కూడా సాధ్యమవుతుంది. మీ Android ఫోన్‌ను లాక్ చేయడం, యూజర్ల డేటాను తొలగించడం కోసం గూగుల్ చాలా సులభమైన మార్గాన్ని మీకు అందిస్తుంది.

Also Read: Income Tax Rules: ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న ఇన్‌కమ్ ట్యాక్స్ కొత్త రూల్స్ ఇవే

స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు కాల్ చేయాలని ఫైండర్‌ను అడగడానికి వారి లాక్ స్క్రీన్‌పై సందేశాన్ని డిస్‌ప్లే చేయవచ్చు. ఇలా చేయడం ద్వారా వినియోగదారులను వారి Android ఫోన్‌లోని మొత్తం డేటాను డిలీట్ చేయడానికి అవకాశం కల్పిస్తుంది. Android ఫోన్‌ను లాక్ చేయడానికి లేదా డేటా తొలగించడానికి ఇది తప్పనిసరిగా ఆన్ చేయాలి. ఆ యూజర్ తప్పనిసరిగా Google అకౌంట్‌తో సైన్ ఇన్ చేయాలి మరియు ఇంటర్‌నెట్ ఆన్ కనెక్ట్ చేయాలి చేయాలి. అప్పుడు Google Playలో తప్పక కనిపిస్తాయి. వాటి స్థానంలో సెట్టింగ్‌ను ఆన్ చేసి మొబైల్ పరికరాన్ని కనుగొని, ఈ ఫోన్‌ను తిరిగి పొందడానికి కింది విధానాన్ని పాటించాలి.

Also Read: EPFO: ఆరు నెలల్లో 71.01 లక్షల EPF Accounts క్లోజ్ చేసిన ఈపీఎఫ్‌వో

Android.com/findకి వెళ్లి ఫోన్‌లో ఉపయోగించే విధంగానే మీ Google Accountకు సైన్ ఇన్ చేయండి. సైన్ ఇన్ చేసిన తర్వాత మీరు మీ ఫోన్‌ను పై భాగంలో ఎడమ మూలలో చూడాలి. ఒకే ఖాతాతో ఒకటి కన్నా ఎక్కువ ఫోన్లు ఉంటే, పోగొట్టుకున్న మొబైల్ డివైజ్ వివరాలు సెలక్ట్ చేసుకోవాలి. ఇది మీకు బ్యాటరీ లైఫ్, ఆన్‌లైన్‌లో చివరిసారిగా యాక్టివ్‌గా ఉన్న వివరాలు అందిస్తుంది.

గూగుల్ మ్యాప్‌లో మీ మొబైల్ ఉన్న స్థానాన్ని దాదాపుగా చూపిస్తుంది. అప్పుడు మీ ఫోన్‌ను గుర్తించకపోతే, మీకు తెలిసిన చివరి లోకేషన్ కనిపిస్తుంది. ఫోన్ సమీపంలో ఉన్నట్లయితే మరియు అక్కడికి వెళ్లాలి. ప్లే సౌండ్ ఆప్షన్‌కు వెళ్లి 5 నిమిషాల పాటు మీ ఫోన్‌ను నిరంతరాయంగా మోగేలా చేయండి.

Also Read: Google Search: గూగుల్‌లో ఈ విషయాలు అసలు సెర్చ్ చేయవద్దు, లేదంటే బ్యాంక్ ఖాతా ఖాళీ

ఫోన్ మీకు తెలియని ప్రాంతంలో ఉన్నట్లయితే, మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను తిరిగి పొందటానికి సొంతంగా ప్రయత్నించవద్దు. మరియు దానికి బదులుగా చట్టబద్ధంగా అమలు చేసేవారిని సంప్రదించాలి. వారు సీరియల్ నంబర్ లేదా IMEI కోడ్‌ను తీసుకుంటారు. దాని ఆధారంగా మీ ఫోన్ యొక్క లోకేషన్‌ను కనుగొంటారు.

సెక్యూర్ డివైజ్ లొకేషన్‌ ఆప్షన్ ఎంచుకుంటే మీరు మొబైల్ స్క్రీన్‌ను లాక్ చేయగలుగుతారు. ఇది మీ ఫోన్‌ను లాక్ చేయడానికి మరియు మీ Google Account నుండి సైన్ ఔట్ కావడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మీ కన్నా ముందు ఫోన్‌ను కనుగొంటే ఓ మెస్సేజ్ మరియు ఫోన్ నెంబర్ అందులో కనిపిస్తుంది. ఇందులో మీరు  మూడవ ఆప్షన్‌ ఎరేజ్ డివైజ్‌ను ఎంచుకోవాలి. తద్వారా మీ మొబైల్‌లోని మొత్తం డేటా శాశ్వాతంగా డిలీట్ అవుతుంది. ఆ తరువాత ఫైండ్ మై డివైజ్ ఈ ఫోన్‌లో పనిచేయదు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link