How to get MUDRA loan: ముద్ర లోన్‌కి ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి ?
లాక్‌డౌన్ సమయంలో దెబ్బతిన్న వ్యాపారాలను చక్కబెట్టుకోవడానికి, నిధులు లేక ఇబ్బందులు పడుతున్న వారికి, కొత్తగా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా ఉపాధి మార్గాన్ని వెతుక్కోవాలని భావించే వారికి మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ముద్ర లోన్ చక్కటి పరిష్కారంగా నిలవనుంది. ముద్ర లోన్ ద్వారా మీరు మీ వ్యాపారం కోసం రూ .10 లక్షల వరకు రుణాలు పొందవచ్చు.
ప్రధాన మంత్రి ముద్ర యోజన పథకం ( PMMY )తో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. పీఎం ముద్ర యోజన పథకం ద్వారా చిరు వ్యాపారులు రూ. 10 లక్షల వరకు రుణం తీసుకుని తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడంతో పాటు దానినే ఒక ఉపాధి మార్గంగాను మల్చుకోవచ్చు. వివిధ రంగాల్లో బిజినెస్ చేసుకునే వెండార్స్, వ్యాపారులు, దుకాణదారులకు ఇది బాగా ఉపయోగపడుతుంది.
ప్రధాన మంత్రి ముద్రా లోన్స్ ద్వారా రుణం పొందవచ్చని చాలామందికి తెలుసు కానీ ఎవరు ఇస్తారు, ఎక్కడి నుంచి పొందాలి అనే విషయాలే చాలామందికి తెలియవు. అటువంటి వారి సందేహాలకు సమాధానమే ఈ వార్తా కథనం. ముద్ర లిమిటెడ్‌లో పేరు నమోదైన కమెర్షియల్ బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు ఈ ముద్ర లోన్ మంజూరు చేస్తాయి.
పీఎం ముద్ర యోజన పథకం కింద బ్యాంకులు మంజూరు చేసే ముద్ర రుణాలు మూడు రకాలుగా ఉంటాయి. అందులో మొదటిది శిశు లోన్ ( రూ 50, 000 వరకు రుణం ) కాగా రెండోది కిషోర్ లోన్ ( రూ. 50,002 నుంచి రూ.5 లక్షల వరకు ) అని పిలుస్తారు. ఇక మూడవ రకం లోన్ విషయానికొస్తే.. తరుణ్ లోన్ స్కీమ్‌గా పిలిచే ఈ ముద్ర రుణం కింద రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు రుణం మంజూరు చేస్తారు.
18 ఏళ్ల వయస్సు నుంచి 65 ఏళ్ల వయస్సు వరకు ఎవరైనా ముద్ర లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్తగా వ్యాపారం చేసుకోవాలనుకునే వారికైనా, ఇప్పటికే వ్యాపారం చేస్తున్న వారికైనా ముద్ర లోన్స్‌కి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులే.
పబ్లిక్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్, రూరల్ డెవలప్‌మెంట్ బ్యాంకులను ( Banks ) నేరుగా ఆశ్రయించి అక్కడైనా ముద్ర లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఆన్‌లైన్ ద్వారా కూడా ముద్ర లోన్‌కు దరఖాస్తు చేయవచ్చు.
ముద్ర లోన్ కింద రుణం పొందడానికి ఎటువంటి సెక్యురిటీ అవసరం లేదు. థర్డ్ పార్టీ నుంచి సెక్యురిటీ లాంటివి ఏవీ అవసరం లేకుండానే ముద్ర లోన్ పొందవచ్చు.
ముద్ర లోన్‌కి దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన డాక్యుమెంట్స్ విషయానికొస్తే.. ఐడెంటిటీ ప్రూఫ్ కోసం ఆధార్ ( Aadhaar ), ఓటర్ ఐడి, ప్యాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఐడి కార్డులు ఉపయోగించుకోవచ్చు. అలాగే అడ్రస్ ప్రూఫ్ కోసం ఎలక్ట్రిసిటీ బిల్, టెలిఫోన్ బిల్, గ్యాస్ బిల్, వాటర్ బిల్ వంటివి సమర్పించవచ్చు. ఏ బిజినెస్ కోసమైతే రుణం తీసుకోవాలని భావిస్తున్నారో.. అందుకు సంబంధించిన బిజినెస్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను ఆధారంగా చూపించాల్సి ఉంటుంది.
Also read : PM KISAN scheme: రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ నిధి డబ్బులు ఎప్పుడు పడతాయి ?
Also read : 7th Pay Commission: గుడ్ న్యూస్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు పెరగనున్న జీతాలు
Also read : Debit Cards and credit cards data leaked: 70 లక్షల ATM cards, credit cards డేటా లీక్