Debit Cards and credit cards data leaked: 70 లక్షల ATM cards, credit cards డేటా లీక్

Debit Card and Credit card Holders data leaked on darkweb | డెబిట్, క్రెడిట్ కార్డును మెయింటెన్ చేయడం కంటే.. వాటి వివరాలను గోప్యంగా దాచిపెట్టుకోవడమే అతి కష్టం అంటుంటారు సైబర్ నేరాల గురించి బాగా తెలిసిన సైబర్ నిపుణులు. అలాంటిది ఇప్పుడు ఏకంగా దేశంలోని 70 లక్షల మంది డెబిట్​, క్రెడిట్​ కార్డుదారుల వివరాలు ఇంటర్నెట్​లో లీక్​ అయ్యాయంటే ఇంకెలా ఉంటుందో ఊహించుకోవడానికే ఆందోళనగా ఉంది కదూ!!

  • Dec 11, 2020, 02:18 AM IST

ఒకవేళ ఆ 70 లక్షల మంది డెబిట్, క్రెడిట్ కార్డుల జాబితాలో మన కార్డు కూడా ఉంటే పరిస్థితి ఏంటి అనే ఊహే వెన్నులో వణుకు పుట్టిస్తోంది కదా!! అవును.. ఎందుకంటే పరిస్థితి అలాంటిదే మరి. 70 లక్షల మందికి చెందిన ఏటీఎం, క్రెడిట్ కార్డుల వివరాలు డార్క్‌వెబ్‌లో లీక్ అయినట్టు సైబర్ సెక్యురిటీ ఎక్స్‌పర్ట్ రాజశేఖర్ రాజహరియా పరిశోధనలో వెల్లడైంది.

1 /4

డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులతో పాటు వాటిని వినియోగించే కస్టమర్లకు చెందిన వ్యక్తిగత, ఆర్థిక సమాచారం డార్క్ వెబ్‌లో లీక్ అయినట్టు రాజశేఖర్ తెలిపారు.

2 /4

డార్క్ వెబ్‌లో లీక్ అయిన ఈ విలువైన డేటా హ్యాకర్ల చేతికి చిక్కితే ఇక అంతే సంగతులు అంటున్నారు రాజశేఖర్. ఈ డేటాను సొంతం చేసుకున్న మరుక్షణమే హ్యాకర్స్ సైబర్ ఎటాక్స్‌కి ( Cyber attacks ) తెరతీస్తారని రాజశేఖర్ హెచ్చరించారు.

3 /4

దొంగిలించిన డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డుల డేటాతో ( Debit cards, Credit cards ) సైబర్ క్రిమినల్స్ ఐడెంటిటీ థెఫ్ట్, ఆన్ లైన్ ఇంపర్సనేషన్, ఫిషింగ్ ఎటాక్స్, స్పామింగ్ లాంటి సైబర్ దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని రాజశేఖర్ తెలిపారు.