Weight Loss: ఉప్మారవ్వతో చిల్లా.. ఇలా చేస్తే బరువు ఈజీగా తగ్గిపోవాల్సిందే..
బరువు తగ్గించుకోవాలని చాలామంది ప్రయత్నిస్తుంటారు. అయితే, లైఫ్‌స్టైల్ లో కొన్ని మార్పులు చేసుకోవాలి. వెయిట్ లాస్ సూజీ ఉప్మారవ్వను ఇలా తయారు చేసుకుంటే బరువు కూడా ఈజీగా తగ్గిపోతారు. ఉదయం మనం తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ నుంచి రాత్రి పడుకునే వరకు మనం తీసుకునే ఆహారం వెయిట్ లాస్ పై ఆధారపడి ఉంటుంది. ఈరోజు మనం వేడివేడిగా ఉప్మారవ్వతో ఈజీ గా బ్రేక్‌ఫాస్ట్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
ఈ సింపుల్ రిసిపీని కేవలం ఇంట్లో ఉండే ఉప్మారవ్వతో తయారు చేసుకోవచ్చు. అదే చిల్లా దీంతో బరువు ఈజీగా తగ్గిపోతారు . అంటే ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి. ఈ రిసిపీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఏంటో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు... ఈ ఉప్మారవ్వతో చిల్లా తయారు చేసుకోవడానికి ఒక కప్పు ఉప్మారవ్వ, అరకప్పు నీరు, కట్ చేసిన ఉల్లిపాయలు, టమాటా, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, ఉప్పు మీ రుచికి సరిపడా తీసుకోవాలి.
ఒక బౌల్ తీసుకుని అందులో ఉప్మారవ్వ, యోగర్ట్, నీళ్లు వేసి దోశ బ్యాటర్ తయారు చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే కట్ చేసిన ఉల్లిపాయలు, టమాటాలు, క్యాప్సికమ్, గ్రీన్ చిల్లీస్ అన్ని కలుపుకోవాలి.
ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసి దోశ బ్యాటర్ తో దోశ వేసుకోవాలి. అది చిల్లా మాదిరి తయారు అవుతుంది. ఓ మూడు నిమిషాల తర్వాత గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారుతుంది.
వేడివేడిగా వడ్డించుకుంటే రుచి అదిరిపోతుంది. గ్రీన్ చట్నీ, యోగార్ట్ తో తీసుకుంటే రుచి అదిరిపోతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)