Best Weight Loss Plan: ఆరు నెలల్లో 15 కిలోల బరువు తగ్గించే అద్భుతమైన వెయిట్ లాస్ ప్లాన్ ఇదే
బుల్లితెర వెటరన్ నటి మోనా సింగ్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడీమె తన పాత్ర కోసం ఏకంగా 15 కిలోలు బరువు తగ్గించుకుంది. అది కూడా కేవలం 6 నెలల్లో. బరువు తగ్గించేందుకు వివిధ రకాల పద్ధతులు అవలంభించి విఫలమౌతున్నవారికి మోనా సింగ్ చెబుతున్న వెయిట్ లాస్ ప్లాన్ వర్కవుట్ కాగలదు.
బరువు తగ్గించుకునేందుకు జిమ్‌లో వర్కవుట్స్ కంటే యోగా అద్భుతమైన ఫలితాలనిస్తుంది. యోగా అనేది హెల్తీ వెయిట్ లాస్‌కు ఉపయోగపడుతుంది.
బరువు తగ్గించుకునేందుకు ఇంటర్‌మిట్టెంట్ ఫాస్టింగ్ అద్భుతమైన సాధనం. ఇందులో 12 గంటల ఫాస్టింగ్ ఉంటుంది. అంటే రాత్రి 7-8 గంటలకు డిన్నర్ పూర్తి చేసి తిరిగి ఉదయం అదే సమయం వరకూ ఏం తినకూడదు
ఇంటర్‌మిట్టెంట్ ఫాస్టింగ్ చేసేటప్పుడు అన్ని రకాల పదార్ధాలు అంటే నాన్ వెజ్ కూడా తినవచ్చు.
బరువు తగ్గించుకోవాలనుకున్నప్పుడు కచ్చితంగా మనం తీసుకునే ఆహారంలో ఫైబర్, ప్రోటీన్లు సమృద్ధిగా ఉండేట్టు చూసుకోవాలి. కేలరీలు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.
అన్నింటికంటే ముఖ్యంగా రాత్రి వేళ తప్పనిసరిగా 7-8 గంటల ప్రశాంతమైన నిద్ర అవసరం. రోజుకు 8-9 గ్లాసుల నీళ్లు తప్పకుండా తాగాలి.