Aadhaar Updation Process: ఆధార్ కార్డులో ఫోటో, పేరు, చిరునామా, పుట్టినతేదీ ఎలా మార్చాలి
ఆధార్ కార్డు ఫోటో ఎలా అప్‌డేట్ చేయాలి
ముందుగా https://uidai.gov.in/ వెబ్‌సైట్‌లో వెళ్లి..అవసరమైన వివరాలు నమోదు చేయాలి. సమీపంలోని ఆధార్ ఎన్రోల్‌మెంట్ సెంటర్ అప్పాయింట్‌మెంట్ తీసుకోవాలి. ఆ సెంటర్‌లో వివరాల్ని పరిశీలించిన అనంతరం కొత్త ఫోటో తీసుకుంటారు. అది ఆధార్ కార్డుపై అప్‌డేట్ అవుతుంది. దీనికోసం వంద రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
ఆధార్ కార్డు నెంబర్ ఎలా అప్‌డేట్ చేయాలి
ముందుగా https://uidai.gov.in/ వెబ్‌సైట్‌లో వెళ్లి..అవసరమైన వివరాలు నమోదు చేయాలి. సమీపంలోని ఆధార్ ఎన్రోల్‌మెంట్ సెంటర్ అప్పాయింట్‌మెంట్ తీసుకోవాలి. ఆ సెంటర్‌లో మీ వివరాలు వెరిఫై చేసిన తరువాత ఫోన్ నెంబర్ అప్‌డేట్‌కు చెల్లించాల్సిన కనీస రుసుము చెల్లించాలి. పది పదిహేను రోజుల వ్యవధిలో మీ ఫోన్ నెంబర్ అప్‌డేట్ అయిపోతుంది.
ఆధార్ కార్డుపై పేరు ఎలా అప్‌డేట్ చేయాలి
ముందుగా యూఐడీఏఐ అధికారిక వెభ్‌సైట్‌లో వెళ్లాలి. ఆ తరువాత ఆధార్ కార్డు వివరాలు నమోదు చేయాలి. మీ కరెక్ట్ పేరు, ఇంటి పేరు సరిగ్గా ఎంట్రీ చేయాలి. తరువాత సెల్ఫ్ ఎట్టెస్టెడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. ఓటీపీ వెరిఫికేషన్ పూర్తి చేయాలి. ఇది కూడా పదిహేను రోజుల్లో అప్‌డేట్ అవుతుంది.
పుట్టినతేదీ ఎలా అప్‌డేట్ చేయాలి
ముందుగా https://uidai.gov.in/ వెబ్‌సైట్‌లో వెళ్లి..అవసరమైన వివరాలు నమోదు చేయాలి. ప్రోసీడ్ అప్‌డేట్ ఆధార్ ఆప్షన్‌లో వెళ్లాలి. 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. క్యాప్చా వెరిఫికేషన్ పూర్తి చేయాలి. అప్‌డేట్ డెమోగ్రఫిక్స్ డేటా ఆప్షన్‌లో వెళ్లి..పుట్టినతేదీ మార్చాలి. మీ మొబైల్ నెంబర్‌కు వచ్చే మరో ఓటీపీ ఎంటర్ చేయాలి. ఇప్పుడు చివరిగా సపోర్టింగ్ డాక్యుమెంట్లు స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.
ఆధార్ కార్డులో అడ్రస్ అప్‌డేట్ ఎలా
ముందుగా https://uidai.gov.in/ వెబ్‌సైట్‌లో వెళ్లి..అవసరమైన వివరాలు నమోదు చేయాలి. ఆ తరువాత మై ఆధార్ ఆప్షన్‌లో వెళ్లి..అప్‌గ్రేడ్ డెమోగ్రఫిక్స్ డేటా ఆన్‌లైన్ క్లిక్ చేయాలి. ప్రోసీడ్ టు అప్‌డేట్ ఆధార్ లింక్ క్లిక్ చేయాలి. అవసరమైన సమాచారం ఎంటర్ చేయాలి. మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. అడ్రస్‌ను క్యాప్చాతో వెరిఫై చేయాలి. ఓటీపీ వెరిఫికేషన్ అనంతరం డెమోగ్రఫిక్స్ డేటా ఆప్షన్ కన్పిస్తుంది. ఇప్పుడు మీ కొత్త చిరునామాను ధృవీకరించే ధృవపత్రాల్ని స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి. చివరిగా సబ్మిట్ ప్రెస్ చేయాలి. పదిహేను రోజుల కాలవ్యవధిలో అడ్రస్ అప్‌డేట్ అవుతుంది.