Satellite Smartphone: ఈ శాటిలైట్ ఫోన్ మీరు కూడా ఉపయోగించవచ్చు, ధర ఎంతంటే
నిరంతరం పర్యటనల్లో ఉండేవారికి ఈ ఫోన్ బాగా ఉపయోగపడుతుంది. దూర ప్రాంతాలు, నెట్వర్క్ లేని ప్రాంతాల్లో తిరిగేవారికి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఎందుకంటే నెట్వర్క్ సమస్య ఉత్పన్నం కాదు.
HUAWEI Mate 60 Pro స్మార్ట్‌ఫోన్ 5జి ప్రోసెసర్, సిస్టమ్ ఆన్ చిప్ తో వస్తుంది. కిరిన్ 9000 ఎస్ అని పిలుస్తారు. చైనాలో తయారైన ఫోన్ ఇది.
Huawei Mate 60 Proలో శాటిలైట్ కాలింగ్ ప్రత్యేకంగా ఉంటుంది. ఈ ఫోన్‌ను ఉపయోగించి నెట్‌వర్క్ లేకుండా హాయిగా మాట్లాడుకోవచ్చు.
ఈ శాటిలైట్ ఫోన్ ధర భారతీయ రూపాయల్లో 80 వేలు. ఈ ఫోన్ ధర విషయంలో ఐఫోన్‌తో పోటీ పడుతుంటుంది. ఐఫోన్ 14 మోడల్‌ను పోలి ఉంది.
ఇక్కడ మనం చర్చిస్తున్నది Huawei Mate 60 Pro గురించి. ఇదొక శాటిలైట్ ఫోన్. అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఫోన్ ఇది.