Hyundai Exter: హ్యుండయ్ నుంచి మిడ్ సైజ్ ఎస్‌యూవీ, ధర 6 లక్షలే, చూస్తే మతి పోతుంది మరి
ఈ కారును హ్యుండయ్ కంపెనీ 6 వేరియంట్లలో లాంచ్ చేసింది. ఈ కారు ప్రారంభధర 5.99 లక్షలు కాగా ఎస్ వేరియంట్ ధర 7,26,990 రూపాయలు. ఇందులో ఎస్ఎక్స్ వేరియంట్ అయితే 7,99,990 రూపాయలుంది. ఇక ఎస్ఎక్స్ ఓ అయితే 8,63,990 రూపాయలు. ఇక టాప్ వేరియంట్ అయితే 9,31,990 రూపాయలుంది. ఇందులోనే సీఎన్జీ వేరియంట్ అయితే 8,23,990 రూపాయలుంది.
హ్యుండయ్ ఎక్స్‌టర్‌లో 1.2 లీటర్ల నేచురల్లీ యాస్పిరేటెడ్, 4 సిలెండర్ పెట్రోల్ ఇంజన్, ఉంటుంది. 83 హెచ్‌పి, 114 ఎన్ ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ మేన్యువల్, 5 స్పీడ్ ఏఎంటీ ఉన్నాయి.
హ్యుండయ్ ఎక్స్‌టర్ సింగిల్ ప్యాన్ సన్‌రూఫ్, డ్యూయర్ కెమేరా ఉన్నాయి. 8 ఇంచెస్ టచ్ స్క్రీన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వైర్‌లెస్ ఛార్జర్ ఉన్నాయి.
హ్యుండయ్ ఎక్స్‌టర్‌లో ఎల్‌ఈడీ డే టైమ్ రన్నింగ్ ల్యాంప్, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, స్పోర్ట్ స్కిడ్ ప్లేట్, 15 ఇంచెస్ డైమండ్ కట్ ఎల్లాయ్ వీల్స్, ఇలా వివిధ ప్రత్యేకతలున్నాయి.
హ్యుండయ్ ఎక్స్‌టర్ ఇండియన్ మార్కెట్లో అత్యంత చౌకైన్ ఎస్‌యూవీగా లాంచ్ అయింది. ఈ కారు ద్వారా హ్యుండయ్ కంపెనీ మైక్రో ఎస్‌యూవీ విభాగంలో ఎంట్రీ ఇచ్చింది. దీని ధర 6 లక్షల కంటే తక్కువే. టాటా పంచ్‌తో ఈ కారు పోటీ పడనుంది.