Ivanka Trump: ఆ ఫొటోలను స్పోర్టివ్‌గా తీసుకున్న ఇవాంక ట్రంప్

Mon, 02 Mar 2020-8:29 am,

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన కుటుంబంతో ఇటీవల రెండు రోజులపాటు భారత్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే రెండేళ్ల కిందట ఏం జరిగిందో.. మళ్లీ అదే సీన్ రిపీట్ అయింది. గతంలోలాగానే అందరి కళ్లూ ట్రంప్ కుమార్తె, ఆయన సలహాదారు ఇవాంకా ట్రంప్ మీదే నిలిచాయి.

ఆమె ధరించిన దుస్తులు, వాటి ధర, ఆమె ఈరకం పాదరక్షలు ధరించారంటూ నెట్టింట ఆమె వివరాలపై జోరుగా పోస్టులు వచ్చాయి. ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ సైతం పలు కార్యక్రమాల్లో పాల్గొన్ని పర్యటనలో తనవంతు పాత్రను పోషించారు. 

ఇవాంక ట్రంప్ భుజం మీద చెయ్యి వేసినట్లగా ఉన్న ఫొటోను సైతం క్రియేట్ చేశారు. బాలీవుడ్ నటుడు, ప్లే బ్యాక్ సింగర్ దిల్జిత్ దోసాన్జ్ సైతం ఇవాంకతో దిగినట్లుగా ఉన్న ఫొటోను షేర్ చేశాడంటే ఆమె క్రేజ్ రేంజ్ ఏంటన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజ్ మహల్ చూద్దామని నా వెంట పడుతుంటే తప్పలేదు. నేను, ఇంకా తాజ్ మహల్ వద్ద అంటూ ఇవాంక మోకాళ్లపై తనకాలు వేసి మస్తీగా దిగినట్లు ఫొటో వదిలాడు ఈ ఫొటో లక్షల్లో లైక్స్, వేలల్లో రీట్వీట్లు, కామెంట్లు వచ్చాయి. 

తాజ్ మహల్‌కు నన్ను తీసుకెళ్లినందుకు ధన్యవాదాలు దిల్జిత్. నేను ఎప్పటికీ ఈ అనుభూతిని మరిచిపోలేనంటూ ఇవాంక ట్రంప్ చాలా హుందాగా స్పందించారు. 

ఆదిత్య చౌదరి అనే నెటిజన్లు మూడు ఫొటోలు పోస్ట్ చేశాడు. మీరు ఆలస్యం చేశారంటూ దిల్జిత్ ట్వీట్‌పై స్పందించాడు. ఇవాంకను సైకిల్ మీద తీసుకెళ్తున్నట్లు, తాజ్ మహల్ వద్ద ఆమె భుజాలపై చేతులు వేసినట్లుగా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ ఫొటోలపై సైతం చాలా హుందాగా స్పందించారు ఇవాంక ట్రంప్. నాకు కొత్త ఫ్రెండ్స్ దొరికారు. భారతీయుల ప్రేమ, అప్యాయతకు ధన్యవాదాలతో పాటు వారు చేసిన పనిని ప్రశంసిస్తూ ఇవాంక ట్రంప్ ట్వీట్ చేశారు.

వాస్తవానికి ఆమె అభిమానులు, నెటిజన్లు మార్ఫింగ్ చేసిన ఫన్నీ ఫొటోలను ట్వీట్ చేశారు. కానీ అందులో ఇవాంకను ట్యాగ్ చేయలేదు. అయినా ట్రంప్ కూతురు ఇవాంక చాలా సరదాగా, స్పోర్టివ్‌గా ఆ ట్రోల్స్‌పై స్పందించడం గమనార్హం. వీటితో పాటు మిమ్మల్ని ఆశ్చర్యపరిచేలా మరికొందరు నెటిజన్లు తమ ఫొటోషాప్ నైపుణ్యానికి పని చెప్పారు. ఇవాంకతో విహరిస్తున్నట్లుగా, ఆమెతో కలిసి గడిపినట్లుగా తయారు చేసిన ఫొటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. (All Images Courtesy: Twitter)

కూతురు ఇవాంక ట్రంప్‌పై ఫన్నీ ఫొటోలు చూసి వాళ్లతో తేల్చుకునేందుకు బుల్లెట్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బయలుదేరినట్లు సైతం నెటిజన్లు ఇలా తయారుచేశారు.

ట్విట్టర్‌లో ఇంకా ఇవాంకాతో తాము అంటూ ఫొటోలు అప్ లోడ్ చేస్తూనే ఉన్నారు. (All Images Courtesy: Twitter)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link