IAS Smita Sabharwal: బాలలతకు బిగ్ షాక్ ఇచ్చిన స్మితా సబర్వాల్.. ఎక్స్ లో రచ్చగా మారిన మరో ట్విట్..

Tue, 23 Jul 2024-3:33 pm,

తెలంగాణ క్యాడర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ రచ్చ ప్రస్తుతం దేశంలో రచ్చగా మారింది. యూపీఎస్సీలో వికలాంగులకు రిజర్వేషన్లు అవసరమా.. అంటూ ఆమె ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. దీంతో స్మితా వ్యాఖ్యలను ఖండిస్తు నెటిజన్లు ఆమెను ఒక ఆటాడేసుకున్నారు. స్మితాకూడా ప్రతి ఒక్కరికి అదే రేంజ్ లో గట్టిగానే కౌంటర్ లు కూడా ఇచ్చారు.

యూపీఎస్సీలో ఇటీవల మహరాష్ట్ర క్యాడెర్ ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజాఖేడ్కర్ ప్రస్తుతం వివాదంగా మారిన విషయం తెలిసిందే. ఆమె ఏకంగా వికలాంగుల ఫెక్ సర్టిఫికేట్, ఓబీసీ కోటాలలో కూడా అనేక నకిలీ సర్టిఫికేట్లను సబ్మిట్ చేసి ఏకంగా యూపీఎస్సీని మోసం చేసింది. అంతేకాకుండా.. ఆమెకు చెందిన అనేక అక్రమాలు వరుసగా బైటపడ్డాయి. దీంతో యూపీఎస్సీ ఆమె అభ్యర్థిత్వాన్ని క్యాన్షిల్ చేసి,పోలీసులకు ఫిర్యాదుకూడా చేసింది.   

ఈ ఘటనపై స్మితా.. యూపీఎస్సీలో వికలాంగులకు రిజర్వేషన్లు అవసరమా..అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. అదే విధంగా దివ్యాంగులను విమానాల్లో తీసుకుంటారా..?.. అదే విధంగా ఒక వికలాంగ సర్జన్ ఉండే అతని దగ్గర బాధితులు ట్రీట్మెంట్ చేయించుకుంటారా.. అంటూ కూడా ఆమె ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇదే వివాదానికి కేరాఫ్ గా మారింది. చాలా మంది నెటిజన్లు.. మనిషిలోని అవయవ లోపం అతని ట్యాలెంట్ కు అడ్డుకాదని కూడా అనేక ఎగ్జాంపుల్స్ తో వివరించారు. 

కాళ్లు లేనివాళ్లు, ఇతర అవయవ లోపం ఉన్నవారు కూడా తమదైన రంగంలో రాణిస్తున్నారంటూ కూడా ఎక్స్ లో చాలా మంది స్మితకు కౌంటర్ ఇచ్చారు. ఇది కాస్త వివాదానికి దారితీసింది. వికలాంగా పోరాట హక్కుల సమితి వాళ్లు పోలీస్ స్టేషన్ లకు వెళ్లి ఫిర్యాదులు సైతం చేశారు. ఇక దీనిపై, ఐఎస్ బీ ఐఏఎస్ అకాడమి చైర్మన్ బాలలత, సీరియస్ గా స్పందించారు. దీనిపై  స్మిత వ్యాఖ్యలను ఖండించారు. పదేళ్లు సీఎంవో లో పనిచేసిన అధికారణి ఇలా మాట్లాడటమేందని అన్నారు. ఐఏఎస్ కావాలంటే అందగత్తేలా అయిన ఉండాలా.. అంటూ కౌంటర్ ఇచ్చారు.

వెంటనే స్మితా తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని, అందరికి బహిరంగంగా సారీ చెప్పాలని డిమాండ్ చేశారు. స్మితకు అంత ట్యాలెంట్ ఉండే తనతో ఎగ్జామ్ రాయాలని కూడా సవాల్ విసిరారు. దీనిపై ప్రభుత్వం, సీఎస్ లు స్పందించి చర్యలు తీసుకొవాలన్నారు. మరోవైపు.. స్మితా వ్యాఖ్యలను తెలంగాణ బీఆర్ఎస్ నేత హరీష్ రావు, కాంగ్రెస్ మంత్రి సీతక్క ఖండించారు. 

తాజాగా, మల్లవరపు బాలలత.. చాలెంజ్ కు తాను రెడీ అని.. కానీ తన ఏజ్ ఎక్కువగా అయినందు వల్ల యూపీఎస్సీ అంగీకరిస్తుందోలేదో అని సెటైర్ వేశారు. ప్రస్తుతం.. బాలలత..   వికలాంగుల కోటాలో ఆమె తన ప్రత్యేక హక్కును దేనికి ఉపయోగిస్తున్నారు.. కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లను నడపడానికి లేదా ఫీల్డ్ వర్క్ ద్వారా ప్రజలకు సేవ చేశారా.. అంటూ సెటైర్స్ వేశారు. దీంతో మరోమారు స్మితా వార్తలలో నిలిచారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link